Thursday, May 2, 2024

AP EAMCET Results 2023: ఎపి ఎంసెట్ ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో విడుదల చేశారు. ఇంజినీరింగ్ లో 76.32 శాతం ఉత్తీర్ణత సాధించారు. అగ్రికల్చర్ లో 89.65 శాతం ఉత్తీర్ణత సాధించారని మంత్రి వెల్లడించారు.  ఈ ఏడాది ఏపీఈపీఏ సెట్ పరీక్షలకు సంబంధించి ఇంజనీరింగ్ స్ట్రీమ్‌కు మే 15 నుంచి 19 వరకు, అగ్రికల్చర్/ఫార్మసీ విభాగాలకు మే 22,23 తేదీల్లో పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

3.15 లక్షల (93.38 శాతం) మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో ఇంజనీరింగ్ విభాగంలో 2,24,724 మంది, ఫార్మసీ, అగ్రికల్చర్ విభాగాల్లో 90,573 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. అభ్యర్థులు తమ మార్కులను cets.apsche.ap.gov.inలో త్వరలో చెక్ చేసుకోవచ్చని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఏపీపీసెట్ చైర్మన్, అనంతపురం జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ జి.రంగ జనార్ధన, కన్వీనర్ ఆచార్య సి.శోభా బిందు, ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామలరావు, ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి ఉన్నారు.

ఎపి ఎంసెట్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఎపి ఎంసెట్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఎపి ఎంసెట్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News