Sunday, April 28, 2024

ఇడి కస్టడీలో తమిళనాడు మంత్రి: ఆస్పత్రి వద్ద మంత్రి రోదన

- Advertisement -
- Advertisement -

చెన్నై: మనీ లాండరింగ్ కేసులో తమిళనాడు మంత్రి, డిఎంకె నాయకుడు వి సెంథిల్ బాలాజీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నించేందుకు బుధవారం తెల్లవారుజామున ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వద్ద మంత్రి భోరున విలపించారు.

మంగళవారం మంత్రి సెంథిల్ బాలాజీ నివాసంపై దాడి జరిపి సోదాలు నిర్వహించిన ఇడి అధికారులు బుధవారం తెల్లవారుజామున ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరం ఇడి అధికారులు వైద్య పరీక్షల నిమిత్తం బాలాజీని గట్టి భద్రత మధ్య చెన్నైలోని ఒమందురర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వద్ద హైడ్రామా చోటుచేసుకుంది.

కారులో కూర్చున్న బాలాజీ నొప్పితో రోదిస్తుండగా బయట గుమికూడిన ఆయన అనుచరులు ఇడికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. బాలాజీని ఆసుపత్రిలోని ఐసియుకు మార్చారని, ఆయన ఆరెస్టుపై ఇడి ఎటువంటి ప్రకటన చేయలేదని డిఎంకె ఎంపి, న్యాయవాది ఎన్‌ఆర్ ఇళంగో తెలిపారు.

ఇలా ఉండగా సెంథిల్ బాలాజీ చికిత్స పొందుతున్నారని, ఈ వ్యవహారాన్ని తాము న్యాయపరంగా తేల్చుకుంటామని డిఎంకె ప్రభుత్వ మంత్రి ఉదయనిధి స్టాలిన్ తెలిపారు. బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ బెదిరింపు రాజకీయాలకు తాము భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News