Friday, May 3, 2024

అపెక్స్‌కు అజెండా

- Advertisement -
- Advertisement -

Apex agenda on water disputes

 

రూపకల్పనలో జికెఎంబి నిమగ్నం, ఆంధ్ర లేఖపై సమీక్ష

మన తెలంగాణ/హైదరాబాద్ : అపెక్స్ కౌన్సిల్ సమావేశాల తేదీ ఎప్పుడు ఖరారు చేసినా పూర్తి స్థాయి సమాచారంతో సిద్ధంగా ఉండేందుకు గోదావరి, కృషా నదీజలాల యాజమాన్యం బోర్డు(జికెఎంబి) సిద్ధమైంది. తెలుగురాష్ట్రాల మధ్యవివాదాలను, వి జ్ఞప్తులను, ఆరోపణలను పరిశీలించి ఎజెండా రూపకల్పన చేస్తున్నారు. ఈ మేరకు శనివారం జలసౌధలో కృష్ణా, గోదావరి నదీ యాజమాన్యం బోర్డు ఆంతరంగిక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇప్పటివరకు ఇరురాష్ట్రాలు వినియోగించిన నీటి వాటాలను పరిశీలించింది. అలాగే గ్రీన్ ట్రిబ్యునల్ ఆక్షేపణలను కూడా నీటిపారుదల నిపుణులు సమీక్షించారు. అపెక్స్ కౌన్సిల్ విజ్ఞప్తి మేరకు అజెండాను ఖరారు చేస్తున్నారు. కౌన్సిల్ సమావేశంలో కేంద్ర జలశక్తి శాఖ నిపుణులు, కేంద్ర జలవనరుల శాఖమంత్రి, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనే అవకాశాలున్నట్లు అపెక్స్ కమిటీ భావిస్తున్న నేపథ్యంలో సమావేశం ఎప్పుడు జరిగినా వాడిగా వేడిగా జరగనున్నట్లు అంచనావేస్తున్నారు.

2015లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం ప్రస్తావించిన అంశాలు, పరిష్కారాలను కూడా విశ్లేషిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం నుంచి ఇప్పటివరకు తరలిస్తున్న 44 వేల క్యూసెక్కులతో పాటు మరో 80 వేల క్యూసెక్కులను తరలించేందుకు అనుమతులు ఉన్నాయా? నీటి లభ్యత ఉం దా? తెలంగాణ వ్యతిరేకిస్తున్న అంశాలను సూక్ష్మం గా విశ్లేషిస్తున్నారు. ఆంధ్ర కృష్ణానదీ జలాలను అదనంగా వినియోగిస్తున్నట్లు అంకెలతో సహా కృష్ణానదీ యాజమాన్యం నివేదిక సిద్ధం చేసినట్లు తెలిసింది. ఎట్టిపరిస్థితుల్లో ఈ అంశం అపెక్స్ కౌన్సిల్‌ల్లో చర్చకు వస్తోందని నీటి పారుదల శాఖ నిపుణులు భావిస్తున్నారు. అలాగే కృష్ణానదీ జలాలలో ఇప్పటివరకు తెలంగాణ పూర్తి స్థాయిలో నీటినివినియోగించలేదని నీటిపారుదల శాఖ ఇచ్చిన నివేదికను కూడా సమావేశంలో చర్చించారు. నీటి పారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదును కృష్ణానదీ బోర్డు సీరియస్‌గా తీసుకుంది.

తెలంగాణకు రావల్సిన నీటి వాటాకు గండి కొడుతూ ఆంధ్ర ప్రాజెక్టులు నిర్మిస్తే న్యాయపోరాటం చేస్తామన్న హెచ్చరిక అధికారయంత్రాంగాన్ని కదిలించింది. మరికొన్ని సమావేశాలు ఏర్పాటు చేసి ఎజెండాను రూపొందించి అపెక్స్ కౌన్సిల్‌కు పంపివ్వనున్నట్లు సంబంధిత శాఖల ఇంజనీర్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల గోదావరి నదీ జలాలను తెలంగాణ అధికంగా వినియోగిస్తుందని చేసిన అరోపణలు కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. అయితే ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న నీటి ప్రాజెక్టుల వివరాలు,నీటి వినియోగం వెల్లడించకుండా తెలంగాణపై ఆరోపణలు చేసిన అంశాన్ని పరిశీలించారు. ఆంధ్రతలపెట్టిన పోలవరం ప్రాజెక్టు నీటి తరలింపు, భూపతిపాలెం, సిలేరు డైవర్షన్ స్కీం, కాటన్ బ్యారేజి, బుర్రిపాలెం ప్రాజెక్టుల నీటి అంశాలను కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News