Monday, April 29, 2024

హైడ్రాక్సీ సేఫ్ కాదు

- Advertisement -
- Advertisement -

Adverse effects in those who used hydroxy chloroquine

 

హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడిన వారిలో వ్యతిరేక ప్రభావాలు, మరణాలు
లాన్సెట్ తాజా అధ్యయనం
మలేరియా, లుపస్, ఆర్థరైటీస్‌కు వాడే మందును కరోనాకు ఉపయోగించడంపై అభ్యంతరాలు
గుండె సంబంధిత వ్యాధులు రాగలవని హెచ్చరిక

మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా కట్టడికి వినియోగిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్వీన్ దివ్యౌషధం కాదని.. పెద్దగా ప్రయోజనం లేదని.. పై పెచ్చు నష్టమేనని అంతర్జాతీయ సైన్స్ మ్యాగజైన్ లాన్సెట్ తాజా అధ్యయనంలో బాంబు పేల్చింది. క్లీనికల్ ట్రయల్స్ రికమండ్ చేయకుండా ట్రయల్స్ దశలో ఉన్న తరుణంలో కరోనా వ్యాప్తి నివారణకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను విరివిగా వినియోగిస్తున్నారని వెల్లడించింది. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను మలేరియా, లుపస్, ఆర్థరటీస్‌లకు మందుగా వాడుతారని రీసెర్చర్ మణిదీప్ మెహ్రా స్పష్టపరుస్తున్నారు. హైడ్రోక్లోరోక్విన్‌పై జరిపిన ఆ అధ్యయనం గుబులు రేపుతోంది. ఆ అధ్యయన సారాంశమేమంటే… ప్రధానంగా యాంటీ మలేరియా డ్రగ్‌గా పేర్కొనే హైడ్రోక్లోరోక్విన్‌ను కరోనా రోగులకు చికిత్సగా అందిస్తున్నారు. దీంతో చికిత్స పొందిన కరోనా రోగులకు హైరిస్క్ ఫ్యాక్ట్‌ర్స్ ఎక్కువగా ఉంటాయని.. కొన్ని సార్లు మరణాలు కూడా సంభవించవచ్చునని ఆ అధ్యయనంలో తేలింది.

హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కు చెందిన పరిశోధకులు దాదాపు ఆరు ఖండాల్లోని 671 ఆసుపత్రులలో సుమారు 96000 మందికి పైగా ఉన్న కరోనా రోగులపై అధ్యయనం చేసిన తర్వాత ఈ సంచలన విషయాన్ని బయటపెట్టారు. హైడ్రాక్సీక్లోరోక్విన్ లేదా క్లోరోక్విన్ డ్రగ్ తీసుకున్న రోగులకు గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఆ అధ్యయనంలో పేర్కొన్నారు. గతేడాది డిసెంబర్ 20 నుంచి ఏప్రిల్ 14 మధ్య సుమారు 14888 మంది కరోనా రోగులకు మాక్రోలైడ్‌తో పాటు హైడ్రాక్సీక్లోరోక్విన్ మందుతో చికత్స పొందారని.. వారిలో దాదాపు 10700 మంది రోగులు మరణించారని తెలిపారు. వాళ్ల వయసు, లింగ భేదాలు, ఆరోగ్య పరిస్థితులతో సహా పలు అంశాలను పరిశీలించిన తర్వాత హైడ్రాక్సీక్లోరోక్విన్ తీసుకున్న రోగులలో మరణాల రేట్ 34 శాతానికి పెరిగిందని, అంతేకాక తీవ్రమైన హార్ట్ అరిథ్మియా వచ్చే ఛాన్సులు 137 శాతం ఉన్నాయని స్పష్టం చేశారు. కాగా, కరోనా వైరస్ రాకుండా ఉండేందుకు తాను హైడ్రాక్సీక్లోరోక్విన్ టాబ్లెట్ తీసుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పిన కొన్ని రోజుల తర్వాత ఈ నివేదిక ప్రచురించబడటం గమనార్హం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News