Saturday, September 20, 2025

నేటి నుంచి యధాతధంగా ఆరోగ్య సేవలు అందుబాటులోకి

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వంతో నెట్‌వర్క్ ఆసుపత్రి అసోసియేషన్ ప్రతినిధుల చర్చలు సఫలీకృతమయ్యాయి. శనివారం నుంచి యథాతథంగా ఆరోగ్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుప్రతులు సమ్మె విరమించాయి. మంత్రి దామోదర్‌ని నెట్‌వర్క్ అసోసియేషన్ ప్రతినిధులు శుక్రవారం రాత్రి కలిశారు. బంజారాహిల్స్ మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి దామోదర్ రాజనర్సింహతో వారు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయి. చర్చల అనంతరం సంతృఫ్టి చెందిన వారు శుక్రవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు యధావిధిగా కొనసాగిస్తామని హామీ నిచ్చారు. పేదలకు వైద్య సేవలందించడంలో ప్రభుత్వానికి నెట్‌వర్క్ ఆసుపత్రులు సహకరిస్తున్నాయి. ఈ సందర్భంగా౪ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ప్రతినిధులను మంత్రి దామోదర రాజనర్సింహా అభినందించారు. ఈ చర్చల్లో భాగంగా ప్రతి నెల నిధులు విడుదల చేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహా వారికి భరోసా నిచ్చారు. దీంతో ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగింపుకు నెట్‌వర్క్ ఆసుపత్రులు తమ సుముఖతను వ్యక్తపర్చాయి. చర్చలు ఫలప్రదంగా ముగియడంతో పేదలకు అందాల్సిన ఆరోగ్యశ్రీ సేవలు శనివారం నుంచి అందుబాటులోకి రానున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News