Friday, May 3, 2024

హాలియాలో రేపటి సిఎం బహిరంగ సభకు ఏర్పాట్లు

- Advertisement -
- Advertisement -

Arrangements for tomorrow’s CM Meeting in Halia

 

హాలియాలో రేపే సిఎం సభ

ఏర్పాట్లు ముమ్మరం n సభను విజయవంతం చేయాలి : మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి

మన తెలంగాణ/ హాలియా: నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని ఆలీనగర్ 14వ మైలు సమీపంలో ఈ నెల 10 న నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని శాసన మండ లి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవా రం ఆలీనగర్ వద్ద జరిగే జరిగే సీఎం బహిరంగ సభా స్థలిని రాజసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, పౌరసరఫరాల శాఖ చైర్మ న్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్, ఎస్పీ ఏవీ రంగనాధ్‌తో కలిసి పరిశీలించారు. సభా సమ యం దగ్గరపడుతున్న తరుణంలో పనులు త్వరతగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం బహిరంగ సభకు సుమారు 2 లక్షలకు పైగా జనం హాజర య్యే అవకావం ఉన్నందున ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

సిఎం సభా స్థలిని ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, ఎన్నికల ఇన్‌చార్జి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు పరిశీలించారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ సీఎం బహిరంగ సభకు ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేస్తున్నట్లు తెలిపారు. అత్యధికంగా నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి 70 వేల మందికి పైగా జన సమీకరణను చేస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సాగు, తాగునీటి సమస్యకు రూ.3 వేల కోట్లతో ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని అన్నారు. ఈ సందర్భం గా సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞత తెలిపేందుకు స్వచ్ఛందంగా సమావేశానికి తరలి రానున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆప్కాబ్ మాజీ చైర్మన్ యడవెల్లి విజయేందర్‌రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, ఎంపీపీ పేర్ల సుమతి పురుషోత్తం, వెంపటి పార్వతమ్మ శంకరయ్య, భగవాన్‌నాయక్, బొల్లం జయమ్మ, జడ్పీటీసీ సూర్యాభాష్యానాయక్, నాయకులు గడ్డంపల్లి రవీందర్‌రెడ్డి, యడవెల్లి మహేందర్‌రెడ్డి, కూరాకుల వెంకటేశ్వర్లు, వర్రా వెంకట్‌రెడ్డి, వద్దిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చెరుపల్లి ముత్యాలు, చేగొండి కృష్ణ, బందిలి పెద్ద సైదులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News