Sunday, April 28, 2024

కౌంటీ మ్యాచ్ బరిలో అశ్విన్?

- Advertisement -
- Advertisement -

Ashwin could play a County Match before England Tests

లండన్: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ కౌంటీ మ్యాచ్ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే జులై 11న సర్రే జట్టు తరఫున అశ్విన్ బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. అశ్విన్ గతంలో కూడా కౌంటీ క్రికెట్ ఆడాడు. నాటింగ్‌హామ్ షైర్, వొర్సెస్టర్‌షైర్ తరఫున అశ్విన్ బరిలోకి దిగాడు. ఈసారి సర్రే తరుఫున ఆడే అవకాశం అశ్విన్‌కు ఏర్పడింది. ఒకవేళ అతను సర్రేకు ప్రాతినిథ్యం వహిస్తే ఇంగ్లండ్ సిరీస్‌కు ముందు మంచి ప్రాక్టీస్ లభించే అవకాశం ఉంది. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన డబ్లూటిసి ఫైనల్లో ఆడడం మినహాయించి అశ్విన్‌కు పెద్దగా ప్రాక్టీస్ లేదనే చెప్పాలి. ఒక వేళ సర్రే తరఫున బరిలోకి దిగిన అశ్విన్‌కు విలువై ప్రాక్టీస్ లభించినట్టే. అయితే దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

Ashwin could play a County Match before England Tests

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News