Thursday, May 2, 2024

ఢిల్లీ, కోల్‌కతాల్లో రూ.100 దాటిన పెట్రోల్ ధర

- Advertisement -
- Advertisement -

Petrol price in Delhi and Kolkata exceeds Rs 100

న్యూఢిల్లీ: ఢిల్లీ, కోల్‌కతా నగరాల్లోనూ లీటర్ పెట్రోల్ ధర రూ.100 మార్క్ దాటింది. దేశంలోని మిగతా నగరాల్లో ఇప్పటికే పెట్రోల్ ధర రూ.100కుపైగా నమోదవుతోంది. బుధవారం లీటర్ పెట్రోల్ ధర 35 పైసలు, డీజిల్ ధర 17 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దాంతో, ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.100.21కి, డీజిల్ ధర రూ.89.53కి చేరింది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.100.23కు చేరుకున్నది. ఈ నెలలో నాలుగోసారి పెట్రోల్ ధరను చమురు సంస్థలు పెంచాయి. అంతర్జాతీయంగా ఇటీవల క్రూడాయిల్ ధర పెరుగుతూ ఉండటం కూడా ఇందుకు కారణమవుతోంది. తాజాగా బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 78 డాలర్లు.

Petrol price in Delhi and Kolkata exceeds Rs 100

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News