Sunday, April 28, 2024

టెన్షన్‌గానే అసోం-మిజోరం సరిహద్దు

- Advertisement -
- Advertisement -
Assam-Mizoram Border Violence
బ్లాకేడ్‌తో మరింతగా రాజుకునే వివాదం

గువహతి / సిల్చార్: అసోం మిజోరం సరిహద్దు ప్రాంతం ఇప్పటికి ఉద్రిక్తంగానే ఉన్నాయి. అయితే మొత్తం మీద పరిస్థితి ప్రశాంతంగా ఉంది. అసోంలో బంద్ ప్రభావంతొ మిజోరంకు ట్రక్కులు, ఇతర వాహనాల రాకపోకలు అంతరాయంతో ప్రజల సరుకుల రవాణాకు ఇబ్బంది ఏర్పడింది. అసోంలోని బరాక్ వ్యాలీలో బంద్ పాటించారు. దీనితో అంతరాష్ట్ర సరిహద్దుల వద్దనే భారీ స్థాయిలో వాహనాలు నిలిచిపొయ్యాయి. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు ఇక్కడనే ఆగిపోవల్సి వచ్చింది. సోమవారం ఈ సరిహద్దు ప్రాంతంలో అసోంమిజోరం రాష్ట్రాలకు చెందిన సాయుధ పోలీసు బలగాల మధ్య ఘర్షణ, ఏడుగురి మృతి తీవ్రస్థాయి ఉద్రిక్తతలను రగిల్చింది. తీవ్ర పరిణామాల సంకేతాలకు దారితీసింది. ఇప్పటికీ పరిస్థితి ఉద్రిక్తతంగానే ఉందని, అయితే ఎటవంటి విపత్కర పరిణామాలు చోటుచేసుకోలేదని అధికారులు బుధవారం తెలిపారు. బలగాలు పరస్పరం 100 మీటర్ల వెనకకు వైదొలిగాయి. ఈ ప్రాంతంలో ఘర్షణలతో అసోం బరాక్ వ్యాలీ ప్రాంతంలో మూడు జిల్లాల్లో నెలకొన్న పరిస్థితిని చక్కదిద్ది, సాధారణ పరిస్థితులు తీసుకువచ్చేందుకు అధికారులు యత్నిస్తున్నారు. ఈ ప్రాంతంలో 12 గంటల బంద్‌కు బరాక్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (బిడిఎఫ్) పిలుపు నిచ్చింది. దీనికి ఐఎయుడిఎఫ్ వంటి రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయి.

బ్లాకేడ్ ఎత్తివేతకు మిజోరం డిమాండ్

అసోంలోని బరాక్ వ్యాలీ ప్రాంతంలో బంద్ దరిమిలా తలెత్తిన ఆర్థిక దిగ్బంధ పరిస్థితిపై జోక్యం చేసుకోవాలని కేంద్రానికి మిజోరం ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. బ్లాకేడ్‌ను పాటిస్తున్నారని, దీని వల్ల తమకు కలిగే చిక్కులను గుర్తించి తగు విధంగా కేంద్రం స్పందించాలని మిజోరం హోం సెక్రెటరీ లాల్‌బియాక్స్‌సంగీ కేంద్ర హోం కార్యదర్శి అజయ్ భల్లాకు ఓ లేఖ పంపించారు. నేషనల్ హై వే 306 రాష్ట్రానికి సంబంధించి రవాణా జీవనాడి అని, ఈ ప్రాంతం మీదుగానే దేశంలోని ఇతర ప్రాంతాలకు అనుసంధానం అవుతామని అయితే ఈ నెల 26 నుంచి అసోంలో ఈ రాదారి మూసివేత ఉందని, ఈ పరిస్థితిని కేంద్రం గమనించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని, కేంద్రం జోక్యానికి ఎదురుచూస్తున్నామని ఈ లేఖలో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News