సిలిగురి: పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి కాన్యాయ్‌పై మంగళవారం దాడి జరిగింది. కూచ్ బిహార్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ఓ ర్యాలీలో పాల్గొనడానికి వెళ్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు ఆయన వాహనంపై రాళ్లు రువ్వారు. బులెట్ ప్రూఫ్ వెహికిల్‌కు చెందిన అద్దాలు ధ్వంపం చేశారు. అయితే బులెట్ ప్రూఫ్ వాహనంలో ఉండడం వల్ల ప్రాణాలతో బయట పడినట్లు సువేందు అధికారి చెప్పారు. ఇలా జరుగుతుందని తనకు తెలుసునని, ఇది అధికార తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల పనేననిఆయన ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను తృణమూల్ కాంగ్రెస్ తోపిపుచ్చుతూ ఇదంతా ఓ డ్రామా అని దుయ్యబట్టింది. సువేందు అధికారి పర్యటించే సమయంలోనే అధికార టిఎంసి సైతం బిజెపి పాలిత రాష్ట్రాల్లో బెంగాలీలపై వేధింపులు, దొడ్డిదారిన రాష్ట్రంలో ఎన్‌ఆర్‌సిని అమలు చేయడానికి చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తుండడం, సువేందు వాహనంపై దాడిచేసిన వారి చేతుల్లో టిఎంసి జెండాలు ఉన్నట్లుగా బిజెపి ఆరోపించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి వాహనంపై దాడి
- Advertisement -
- Advertisement -
- Advertisement -