- Advertisement -
రంగారెడ్డి జిల్లా తొర్రూర్ లోని రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్ల బహిరంగ వేలం ప్రక్రియను ఆగస్టు 10 వ తేదీ (ఆదివారం)న నిర్వహిస్తున్నట్లు రాజీవ్ స్వగృహ మేనేజింగ్ డైరక్టర్ వి.పి.గౌతం తెలిపారు. ముందు నిర్దేశించిన ప్రకారం ఈ బహిరంగ వేలం ప్రక్రియను ఆగస్టు 6 న నిర్వహించాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాల వల్ల వాయిదా వేయడం జరిగిందన్నారు. ఇక్కడ వంద ప్లాట్లను బహిరంగ వేలం ద్వారా విక్రయించడానికి గత నెలలోనే ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. సుమారు 240 మంది కొనుగోలు దారులు ఈ వేలం ప్రక్రియలో పాల్గొనడానికి ఆసక్తి చూపుతున్నారు. తాజాగా ఈ ప్లాట్ల వేలం ప్రక్రియను ఆగస్టు 10న పెద్ద అంబర్‌పేట లోని అవికాగ్రాండ్ లో నిర్వహించనున్నారు.
- Advertisement -