Tuesday, May 7, 2024

పాలిటెక్నిక్ చదువుతో విద్యార్థులకు బంగారు భవిష్యత్తు

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: పాలిటెక్నిక్ విద్య విద్యార్థులకు బంగారు భవిష్యత్తులాంటిదని సంగారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీనివాసేలే తెలిపారు. మంగళవారం సంగారెడ్డిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పాలిసెట్ పరీక్షను సందర్శించి, పదో తరగతి విద్యార్థినీలకు పాలిటెక్నిక్ వలనకలిగే ప్రయోజనాలను వివరించారు. పాలిటెక్నిక్ వలన స్వయం ఉపాధితో పాటు పాలిటెక్నిక్ తర్వాత ఇంజనీరింగ్ రెండవ సంవత్సరంలో ప్రవేశాలు పొందవచ్చన్నారు. ఈ అవకాశాన్నీ పదోతరగతి విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పాలిసెట్ పరీక్షకు ఏప్రిల్ 24వ తేదీ లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆనంద్‌కుమార్, భాన్సింగ్, శ్రీనివాస్‌గౌడ్‌లున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News