అయోధ్య: రామజన్మభూమిలో రాముడి గుడి నిర్మించడానికి అంచనా ప్రకారం రూ. 1800 కోట్లు ఖర్చు కాగలదని ట్రస్ట్ అధికారులు ఆదివారం తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్ అనేక సమావేశాల అనంతరం ఉత్తరప్రదేశ్‌లో గుడి నిర్మాణానికి సంబంధించి నియమాలు, విధానాలను రూపొందించింది. ఫైజాబాద్ సర్కూట్ హౌజ్‌లో జరిపిన సమావేశంలో మందిర కాంప్లెక్స్‌లో హిందూ మత గురువుల విగ్రహాలకు కూడా చోటు కల్పించాలని నిర్ణయించారు. దాఖలు చేసిన నిపుణుల రికార్డు ప్రకారం కేవలం మందిర నిర్మాణానికే రూ. 1,800 కోట్లు ఖర్చు కాగలదని అంచనా. ట్రస్ట్ ప్రతి ఒక్కరి సలహా సూచనల మేరకు నియమాలు, బైలాస్‌లను పూర్తి చేసిందని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. సమావేశానికి 15 మందిలో 14 మంది ట్రస్ట్ సభ్యులు హాజరయ్యారు. రామ మంది నిర్మాణం 2023 డిసెంబర్ నాటికి పూర్తికాగలదని భావిస్తున్నారు. గర్భ గుడిలో రాముడి విగ్రహం 2024 జనవరి మకర సంక్రాంతి పండుగకల్లా ప్రతిష్టించబడుతుందని తెలుస్తోంది.
అయోధ్య రామ మందిర నిర్మాణానికి రూ. 1800 కోట్ల ఖర్చు కాగలదు: ట్రస్టు
- Advertisement -
- Advertisement -
- Advertisement -