Friday, April 26, 2024

వైభవంగా అయ్యప్పస్వామి పల్లివేట

- Advertisement -
- Advertisement -

పల్లివేట, మహా అన్నదాన దాత డాక్టర్ రాణాప్రతాప్‌రెడ్డి
అయ్యప్ప శరణుఘోషతో మారుమోగిన నర్సంపేట
వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి

Ayyappa swamy irumudi

మన తెలంగాణ/నర్సంపేట : నర్సంపేట పట్టణంలోని శ్రీ ధర్మ శాస్తా అయ్యప్పస్వామి దేవాలయం 21వ మండల పూజ మహోత్సవంలో భాగంగా బుధవారం అయ్యప్పస్వామికి పల్లివేట కార్యక్రమం ఆలయ కమిటీ ఛైర్మన్ శింగిరికొండ రజనీ మాధవశంకర్ గుప్తా ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. పల్లివేట, మహా అన్నదాన దాతగా టీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ యువ నాయకుడు డాక్టర్ గోగుల రాణాప్రతాప్‌రెడ్డి ఉన్నారు. ఉదయం దేవాలయంలో గణపతి హోమంతో ప్రారంభమైన పూజా కార్యక్రమాలను వేద పండితులు బ్రహ్మశ్రీ వెంకటేశ్వర శర్మ గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా న ర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, దాత గోగుల రాణాప్రతాప్‌రెడ్డి కుటుంబ సభ్యులతో దేవాలయ సేవా సమితి ట్రస్టు ఆధ్వర్యంలో ప్ర త్యేక పూజలు చేసిన అనంతరం పల్లివేట కార్యక్రమాన్ని ప్రారంభించా రు.

కాగా రాణాప్రతాప్‌రెడ్డి స్వామివారి విగ్రహాన్ని తలపైన ఎత్తుకొని పల్లివేట ఊరేగింపు ప్రారంభించారు. పట్టణంలోని ప్రధాన రహదారిపై ఊరేగింపుగా అయ్యప్ప మాలదారుల నృత్యాలు, మహిళల కోలాటాలు, డప్పు చప్పుళ్లతో మున్సిపాలిటీ కార్యాలయం పార్కులో ఏర్పాటుచేసిన పుంగావనం వద్దకు అయ్యప్పను తీసుకెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రాణాప్రతాప్‌రెడ్డి అయ్యప్పస్వామి కి సర్వ సైనాధ్యక్షునిగా వ్యవహరించి స్వామి వారిని వేటకు తీసుకెళ్లారు. వేదపండితుడు వెంకటేశ్ శర్మ చేసిన నాట్యం అయ్యప్ప మాలదారులను, ప్రజలను ఆకర్షించింది. పల్లివేట భక్తి శ్రద్ధలతో అయ్యప్ప నామస్మరణతో నర్సంపేట మారుమోగింది.

ఈ కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ ఛైర్మన్ గుగులోతు రామస్వామి, మున్సిపల్ ఛైర్ పర్సన్ గుం టి రజనీ కిషన్, ఏసీపీ ఫణీందర్, సీఐలు పులి రమేశ్‌గౌడ్, సూర్యప్రసాద్, కమిషనర్ విద్యాధర్, గోగుల ప్రతాప్‌రెడ్డి, వైస్ ఛైర్మన్ మునిగా ల వెంకట్‌రెడ్డి, రాయిడి రవీందర్‌రెడ్డి, పీఆర్టీయూ ఉపాధ్యాయ సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఈదునూ రి రవీందర్‌రెడ్డి, ఖానాపురం మండలాధ్యక్షుడు నెల్లూరి ప్రసాద్, మున్సిపల్ మాజీ ఛైర్మన్ నాగెల్లి వెంకటనారాయణ, మాజీ ఎంపీపీ న ల్లా మనోహన్‌రెడ్డి, ఎస్సైలు రాంచరణ్, బొజ్జ రవీందర్, నల్లా భారతి, డాక్టర్ శింగిరికొండ శీతల్, కౌన్సిలర్లు దార్ల రమాదేవి, మహబూబ్‌పా షా, జుర్రు రాజు, శీలం రాంబాబు, గోల్యానాయక్, గందె రజిత చం ద్రమౌళి, ఆలయ కమిటీ సభ్యులు శ్రీరాం ఈశ్వరయ్య, మాదారపు చంద్రశేఖర్, వంగేటి గోవర్దన్, బాల్నె సర్వేశం, శ్రీరాముల శంకర య్య, భూపతి లక్ష్మీనారాయణ, బీరం రవీందర్‌రెడ్డి, బీరం నాగిరెడ్డి, పుల్లూరి స్వామి, గుమాస్తా దేశి రాము, ఆలయ పూజారులు దేవేశ్ మి శ్రా, గణేష్, గురుస్వాములు నాగరాజు, యాదగిరి, బాబురావు, వ్యా పారులు రవీందర్, రమేశ్, శ్రీనివాస్, రాంనారాయణ, ప్రజాప్రతినిధు లు, భక్తులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News