Tuesday, April 30, 2024

త‌మిళ హీరోతో గుత్తా జ్వాల నిశ్చితార్ధం..

- Advertisement -
- Advertisement -

బ్యాడ్మింట‌న్ స్టార్ గుత్తా జ్వాల, త‌మిళ హీరో విష్ణు విశాల్ లు త్వరలో ఒక్కటి కాబోతున్నారు. సోమవారం వీరి నిశ్చితార్ధం జ‌రిగినట్లు విష్ణు విశాల్ వెల్లడించాడు. ఈ రోజు గుత్తా జ్వాల బ‌ర్త్ డే సంద‌ర్భంగా విష్ణు విశాల్ ఆమె బర్త్ డే విషెష్ తెలుపుతూ త‌మ ఎంగేజ్‌మెంట్ జ‌రిగిన‌ట్టు ట్వీట్టర్ ద్వారా ప్ర‌క‌టించాడు.  ‘కొత్త జీవితం ప్రారంభానికి మీ అంద‌రి ఆశీర్వాదం, ప్రేమ మాకు కావాలి’ అని పేర్కొన్నాడు. కాగా, 2008లో బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ చేత‌న్ ఆనంద్‌ని వివాహం చేసుకున్న గుత్తా జ్వాల.. ఆ తర్వాత విడిపోయారు. ఇక, విష్ణు విశాల్‌ కూడా 2001లో వివాహం చేసుకున్నాడు. రెండేళ్ల క్రితం తన భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత నుంచి విష్ణు విశాల్ గుత్తా జ్వాల‌తో రిలేష‌న్‌లో ఉంటున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఇద్దరూ మరోసారి కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నారు.

Badminton Gutta Jwala engaged with Tamil Hero

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News