Tuesday, April 30, 2024

బ్యాడ్మింటన్, షూటింగ్‌కు తెలంగాణ పుట్టినిల్లు: శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దేశానికి గగన్ నారంగ్ గొప్ప పేరు తీసుకొచ్చారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. గన్‌ఫర్‌గ్లోరీ షూటింగ్ అకాడమీలో చీర్‌ఫర్ ఇండియా కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్ మట్లాడారు. ఎంతో మంది క్రీడాకారులను గగన్ నారంగ్ అకాడమీ తయారు చేసిందని, బ్యాడ్మింటన్, షూటింగ్‌కు తెలంగాణ పుట్టినిల్లుగా మారిందని ప్రశంసించారు. దేశం నుంచి ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో 15 మంది వెళ్లడం వెనక గగన్ నారంగ్ కృషి ఉందని కొనియాడారు. గన్‌ఫర్‌గ్లోరీ అకాడమీ నుంచి ఐదు మంది ఒలింపిక్సు వెళ్లడం గొప్ప విషయమని కితాబిచ్చారు. గగన్ నారంగ్‌కు ప్రభుత్వం అని విధాలుగా సహాయక సహకారాలు అందిస్తామని, క్రీడాకారులతో పాటు కోచ్‌లకు సముచిత స్థానం కల్పిస్తామని శ్రీనివాస్ గౌడ్ హామీ ఇచ్చారు. హకీంపేట స్పోర్ట్ స్కూల్‌ను ఆధునీకరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, షూటర్ గగన్ నారంగ్, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News