Tuesday, May 21, 2024

వాటిపై బర్త్‌డే రోజున ప్రకటన

- Advertisement -
- Advertisement -

Balakrishna act in akhanda movie

 

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న భారీ చిత్రం ‘అఖండ’. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే గత కొన్ని రోజులు క్రితమే ఈ చిత్రం నుంచి సాలిడ్ అప్‌డేట్ రావాల్సి ఉంది కానీ అది కాస్తా వాయిదా పడింది. మరి దీనిని పక్కన పెడితే బాలయ్య పుట్టినరోజైన జూన్ 10న తాను నెక్స్ చెయ్యబోయే రెండు భారీ ప్రాజెక్ట్‌లపై అధికారిక అప్‌డేట్‌లు రావడం ఖాయమని తెలిసింది. ఇప్పటికే హిట్ దర్శకులు గోపీచంద్ మలినేని, అనీల్ రావిపూడిల స్క్రిప్ట్‌లకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. మరి వాటిపైనే అధికారిక ప్రకటన ఆరోజు రావచ్చని సమాచారం. ఇక వీటితో పాటుగా ‘అఖండ’ నుంచి కూడా ఏదైనా సాలిడ్ ట్రీట్ వస్తుందేమో చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News