Friday, May 10, 2024

మూడో దశనూ తుద ముట్టిద్దాం

- Advertisement -
- Advertisement -

Telangana ideal for fever survey in India

 

150 పడకలతో టిమ్స్‌లో ఐసియు
కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్నివిధాలా సిద్ధం
విదేశాల్లో వృథాగా ఉన్న కోట్లాది కొవిషీల్డ్ టీకాలను తెప్పించాలి
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పటిష్ట చర్యలతోనే రెండో దశ కరోనా ప్రభావం తగ్గింది : మంత్రి కెటిఆర్

మనతెలంగాణ/గచ్చిబౌలి: కరోనా సమస్యను అధిగమించేందుకు సమీష్టి కృషి అవసరమని, కేవలం ఒక వ్యక్తీ, సంస్థ, ప్రభుత్వంతో అది సాధ్యం కాదని, సమిష్టి కృషి అవసరమని మంత్రి కేటిఆర్ పేర్కోన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని టీమ్స్ హస్పిటల్ లో హైసియా మరియు మైక్రోసాప్ట్, క్వాలం, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, కాగ్నిజెంట్, వెల్స్ ఫార్గో సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి 150 పడకల ఐసియూ బెడ్స్ ను ఎమ్మేల్యే మెతుకు ఆనంద్, టీమ్స్ డైరెక్టర్ విమల థామస్, డిఎంఈ రమేష్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మేల్యే అరికెపుడి గాంధీ, సైబరాబాద్ సిపి సజ్జనార్, ఐటి మరియు పరశ్రమల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ రవి కిరణ్, డిప్యూటి కమిషనర్ వెంకన్న లతో కలిసి మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు. కరోనా రోగులను పరామర్శించి వారి యోగక్షేమాలు మరియు వార్డులో అందుతున్న వైద్య సేవలను గురించి ఈ సందర్భంగా ఆయన అడిగి తెలుసుకున్నారు.

అనంతరం కెటిఆర్ మాట్లాడుతు కరోనా మొదటి వే మరియు రెండవ వేలో ఐటి సంస్థలు వారి ఉదారతతో మరోసారి తమ వంతుగా సాధ్‌యమైనంత వారికి సేవ చేసేందుకు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. 150 పడకల ఐసియూ సెంటర్ ను టీమ్స్ హస్పిటల్ ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమని, ఐటి సంస్థలు వీటిని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. రాష్ట్రంలోని పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చేంచదుకు కేంద్రంతో ఎప్పటికప్పుడు చర్చించడం జరుగుతుందని, వాక్సినేషన్ ప్రక్రియను కూడా వేంగవంతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కోన్నారు. కరోనా నియంత్రణ కేవలం ఒక వ్యక్తీ, సంస్థ లేద ప్రభుత్వంచే సాధ్యమయ్యేది కాదని దానికి సమీష్టి కృషి అవసరం అని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో కోటి వాక్సిన్ల కోసం టెండర్లను ఆహ్వనించడం జరిగిందని, రాష్ట్రంలో వాక్సినేషన్ ఉత్పత్తి కొనసాగుతుందని, ప్రతి రోజు డోసుల ఉత్పత్తి జరుగడంతో వాక్సిన్ హబ్ గా తెలంగాణ రాష్ట్రం మారిందని ఆయన పేర్కోన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐటి సంస్థలు రాష్ట్రానికి అందించే సహకారం పై చర్చిస్తున్నమని, వాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగించేందుకు కేంద్రం చొరవ తీసుకోవాలని, విదేశాలలో ఉన్న డోసులను ఆయా దేశా ప్రధానులతో మాట్లాడి మన దేశ ప్రజలకు అందించే విధంగా కృషి చేయాలని ఆయన కోరారు. అదేవిధంగా కరోనా సెకండ్ వే సమర్థవంతంగా ఎదుర్కోంటున్నమని, బెడ్ల కొరత, ఆక్సిజన్ కొరత లేదని, కరోనా రోగులకు మరిన్ని బెడ్స్, ఆక్సిజన్ ను సమకూరుస్తామని, టీమ్స్ హస్పిటల్ లో అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కోన్నారు. కరోనా మూదవ దశ ఎదుర్కోవాడానికి ప్రభుత్వం సద్ధంగా ఉందని ఇప్పటికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, ప్రజల ఆరోగ్యం కోసం అన్ని విధాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ సదుపాయాలు కల్పిస్తారని ఆయన తెలిపారు. అనంతరం శేరిలింగంపల్లి ఎమ్మేల్యే గాంధీ మాట్లాడుతు ఇక్కడి పరిసర ప్రాంత ప్రజలకు ఈ ఐసోలేషన్ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుందని, అన్ని రకాల వసతులతో ఈ ఐసోలేషన్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని కల్వరి టెంపులో 300 బెడ్లు, న్యాక్ లో 200 బెడ్లు, పత్రిక నగర్ లో 100 బెడ్లు, హుడా కాలనీలో 25 పడకల కోవీడ్ కేర్ ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలనుసారం కోవీడ్ తో బాధపడుతున్న వారికి మెరుగైన చికిత్స అందించడానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రయివేట్ హస్పిటల్ కు ధీటుగా ప్రభుత్వ హస్పిటల్ లో మెరుగైన వైద్యం అందిస్తున్నాయని ఆయన పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, మియాపూర్ డివిజన్ కార్పోరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పోరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా, ఏఎంహెచ్‌ఓ రవి, గ్రంథలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్, గచ్చిబౌలి డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులు రాజు నాయక్, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, తెరాస నాయకులు నాయినేని చంద్రకాంత్, సత్యనారాయణ, సురేందర్, రమేష్, గురుచరణ్ ధూబే, నవాజ్ మరియు వివిధ సాప్ట్‌వేర్ సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గోన్నారు.

Minister KTR inaugurates 150 ICU beds at TIMS in Gachibowli

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News