Thursday, May 2, 2024

బంగ్లాదేశ్ లక్ష్యం 143

- Advertisement -
- Advertisement -

Bangladesh target is 143

దుబాయ్: టి-20 వరల్డ్ కప్‌లో భాగంగా షార్జా క్రికెట్ స్టేడియంలో బంగ్లాదేశ్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో విండీస్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ ముందు 143 పరుగుల లక్ష్యాన్ని విండీస్ ఉంచింది. రోస్టన్ చేజ్(39), నికోలస్ పురాన్(40) ధాటిగా బ్యాటింగ్ చేశారు. లూవిస్ ఆరు పరుగులు చేసి ముష్తఫీజర్ బౌలింగ్‌లో మష్ఫీకర్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. క్రిష్ గేల్ నాలుగు పరుగులు చేసి మహేదీ హసన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. హెట్‌మేయర్ 9 పరుగులు చేసి హసన్ బౌలింగ్‌లో సర్కార్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అండ్రూ రస్సెల్ పరుగులేమీ చేయకుండా రనౌట్‌గా వెనుదిరిగాడు. డ్వేన్ బ్రావొ ఒక పరుగు చేసి ముస్తాఫీజర్ బౌలింగ్ లో సౌమ్య సర్కార్ కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడారు. కీరన్ పొలార్డ్(14), జేషన్ హోల్డర్ (15) పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. చివరలో హోల్డర్ ఐదు బంతుల్లో 15 పరుగులు చేశాడు. 15 పరుగుల్లో రెండు సిక్స్ లు ఉన్నాయి. బంగ్లాదేశ్ బౌలర్లలో హసన్, ఇస్లామ్, రహ్మాన్ తలో రెండు వికెట్లు తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News