Saturday, April 27, 2024

కాబోయే భర్తను పరిచయం చేసిన బర్రెలక్క

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో బర్రెలక్కగా ఫేమస్ అయిన కర్నె శిరీష పెళ్లి పీటలెక్కబోతోంది. ఇటీవల తాను పెళ్లి చేసుకోబోతున్నట్టు సోషల్ మీడియాలో ఆమె వెల్లడించింది. పెళ్లి పనులు ప్రారంభమైనట్లు తెలుపుతూ ఓ వీడియోను కూడా పోస్ట్ చేసింది. దీంతో బర్రెలక్క ఎవరిని పెళ్లి చేసుకుంటుందనే విషయంపై నెటిజన్లు ఆరా తీయడం స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో స్వయంగా శిరీష తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది. కాబోయే భర్తతో కలిసి చేసిన ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియోను తన ఇస్టాగ్రామ్ లో షేర్ చేసింది శిరీష. నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి గ్రామానికి చెందిన వెంకటేస్ అనే వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకోబోతోంది. మర్చి 28న నాగర్ కర్నూల్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో వీరి వివాహం జరగనుంది.

కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆమె కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. 5754 ఓట్లతో ఆమె నాలుగో స్థానంలో ఉండిపోయారు. 2022 డిసెంబర్‌లో ఆమె బర్రెలకు కాపారిగా ఉంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఉద్యోగాలు రావడం లేదని, అందుకే బర్రెలు కాస్తూ జీవనం సాగిస్తున్నానని చెప్పుకొచ్చారు. దీంతో వీడియో వైరల్ కావడంతో ఆమె పేరు బర్రెలక్కగా ముద్రపడిపోయింది. అప్పటి నుంచి రీల్ చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీగా మారిపోయింది.

ఇటీవల బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు రావడంతో ఆమె ఖండించారు. ప్రశాంత్ తనకు అన్నయ్య లాంటి వాడు అని చెప్పడంలో నెటిజన్ల నోళ్లకు తాళం పడింది. తన పెళ్లి గురించి ఆమె ఆధికారికంగా వెల్లడించడంతో నిశ్చితార్థం జరిగినట్లు వీడియోలో పేర్కొంది. తన ఎంగేజ్‌మెంట్ సడెన్ గా సెట్ కావడంతో ఎవరినీ పిలువలేకపోయానని వివరణ ఇచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News