Friday, May 3, 2024

బాటసింగారం మార్కెట్‌లో ఊపందుకున్న పండ్ల వ్యాపారం

- Advertisement -
- Advertisement -

అదనపు షెడ్ల ఏర్పాటుతో జోరుగా పండ్ల క్రయ, విక్రయాలు
పండ్ల వ్యాపారులు, రైతులతో కిక్కిరిసిన మార్కెట్

మన తెలంగాణ/అబ్దుల్లాపూర్‌మెట్: నగర శివారు బాటసింగారం లాజిస్టిక్ పార్కులో ఏర్పాటు చేసిన తాత్కాలిక పండ్ల మార్కెట్‌లో వ్యాపారం లావాదేవిలు పూర్తి స్థా యి లో ఊపందుకున్నాయి. ఇటీవల వ్యాపారుల సౌలభ్యం కో సం నిర్మించిన షెడ్లు పూర్తిగా అందుబాటులోకి రావడం తో శుక్రవారం పండ్ల వ్యాపార క్రయవిక్రయాలు జోరుగా సాగాయి. మార్కెట్ ఏర్పాటు జరిగితన తర్వాత ఇంత పె ద్ద మొత్తంలో వ్యాపారులు రావడంతో మార్కెట్ కిక్కిరిసిపోయింది. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారం లాజిస్టిక్ పార్కులో గడ్డిఅన్నారం తాత్కాలిక మార్కెట్‌ను ఏర్పాటు చేసిన నాటి నుండి కొంత మంది కమీషన్ ఏజెంట్లు సౌకర్యాలు లేవని క్రయ విక్రయాలు సాగించేందుకు గాను అసక్తిగా చూపించ లేదు. దాంతో మార్కెటింగ్ శాఖ అదనపు డైరెక్టర్, గడ్డిఅన్నారం మా ర్కెట్ ప్రత్యేక అధికారి లక్ష్మణుడు ప్రత్యేక శ్రద్ద చూపించి అదనంగా షెడ్ల ఏర్పాటు, సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించారు.

అందులో భాగంగా షెడ్ల నిర్మాణం పనులను త్వరితగతిన పూర్తి చేయించి అందుబాటులోకి తీసుకోచ్చారు. ఇక్కడికి వచ్చే రైతులకు, వ్యాపారులకు ఏలాంటి ఇబ్బదులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం పండ్ల మార్కెట్‌లో అదనపు షెడ్లను అందుబాటులోకి తీసుకవచ్చి ఆయా పండ్ల వ్యాపారుల కు షెడ్లను కేటాయించారు. దాంతో శుక్రవారం ఉదయం నుండి పెద్ద సంఖ్యలో మార్కెట్ అవరణంలో పండ్ల వ్యా పారులతో కిక్కిరిసిపోయింది. మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు జిల్లాల నుండి దాదాపు 130 వివిధ పండ్ల లోడు వాహనాలు మార్కెట్‌కు తరలివచ్చాయి.

పైనాపిల్, బొప్పాయి, దానిమ్మ, మో సంబి, ద్రాక్ష, ఆరెంజ్, బేర్, వాటర్ మిలాన్ ఆపిల్ పండ్ల వ్యాపారులతో సందడిగా మారింది. మార్కెట్ కార్యదర్శి పద్మహర్ష, ఇన్‌చార్జీ కార్యదర్శి చిలుక నర్సింహారెడ్డిలు తమ సిబ్బందితో వ్యాపార కార్యకలాపాలను పర్యవేక్షించారు. వ్యాపారం సాగించే సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మార్కెటింగ్ శాఖ నోటిఫైడ్ చేసిన బాటసింగారంలోని తాత్కాలిక గడ్డిఅన్నారం మార్కెట్‌లో మాత్రమే పం డ్ల వ్యాపారులు తమ క్రయ విక్రయాలను సాగించాలని సూచించారు. మార్కెట్ శాఖ చట్టప్రకారం ఇతర ప్రాంతాలలో వ్యాపార లావదేవిలు సాగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News