Sunday, April 28, 2024

‘ఆర్‌ఆర్‌ఆర్’ విడుదల ఎప్పుడంటే?

- Advertisement -
- Advertisement -

When released RRR Movie

కరోనా తీవ్రత కారణంగా దేశవ్యాప్తంగా థియేటర్లు మూత పడుతున్నాయి. పలు చోట్ల 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీ జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది. కానీ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో సినిమాను వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా సినిమా విడుదల గురించి ప్రకటన చేసింది.

పరిస్థితులు అనుకూలంగా ఉండి, కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టి, థియేటర్లలో వంద శాతం ఆక్యుపెన్సీ ఉంటే మార్చి 18న విడుదల చేస్తామని తెలిపింది. అలా కాకపోతే ఏప్రిల్ 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనతో అభిమానులు, ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. అలియా భట్, ఒలివియా మోరిస్‌లు హీరోయిన్స్‌గా నటించారు. అజయ్ దేవగన్, శ్రియా శరణ్, సముద్ర ఖనిలు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News