Thursday, April 18, 2024

బిసిల నిధులు విడుదల చేయడంలేదు: ఈటెల

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షల కోట్లు అప్పులు చేసిందని బిజెపి ఎంఎల్‌ఎ ఈటెల రాజేందర్ మండిపడ్డారు. అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ జరిగిన సందర్భంగా ఈటెల మాట్లాడారు. జిఎస్‌డిపిలో 25 శాతానికి మించి అప్పులు చేయకూడదని తెలంగాణ ప్రభుత్వానికి తెలియదా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం జిఎస్‌డిపిలో 38 శాతం అప్పులు చేసిందని, బిసిల కోసం బడ్జెట్‌లో పెట్టిన నిధులు విడుదల చేయడంలేదని, మధ్యాహ్న భోజనం కార్మికుల బిల్లులు ప్రతి నెలా చెల్లించాలని ఈటెల డిఆమాండ్ చేశారు. గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన రైతు రుణమాఫీని పూర్తి చేయాలని అడిగారు.

అసెంబ్లీలో వసతుల గురించి ఈటెల, మంత్రుల మద్య సంవాదం నెలకొంది. అసెంబ్లీ ప్రాంగణంలో బిజెపి సభ్యులకు వసతి కల్పించడంలేదని మండిపడ్డారు. బిజెపి సభ్యులు టిఫిన్ చేసేందుకు కూడా అవకాశం లేదని, ఇంటి నుంచి తెచ్చుకున్న టిఫిన్ తినేందుకు అవకాశం లేదనడంతో వెంటనే ఈటెల రాజేందర్ మాటలను మంత్రి హరీష్ రావు తప్పుపట్టారు. ఐదుగురు సభ్యులుంటేనే ఆ పార్టీకి ఆఫీస్ ఇచ్చే సంప్రదాయం ఉందని మంత్రి హరీష్ రావు తెలిపారు. సౌకర్యాల గురించి ప్రస్తావించే వేదిక ఇది కాదని మంత్ర ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీలో బడ్జెట్ గురించి మాత్రమే మాట్లాడాలని ప్రశాంత్ రెడ్డి సూచించారు. సౌకర్యాల గురించి స్పీకర్ ఛాంబర్‌కు వెళ్లి మాట్లాడాలని ఈటెలకు ప్రశాంత్ సలహా ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News