Friday, May 3, 2024

మెగా డిఎస్‌సి ప్రకటనపై బిసి సంఘాల హర్షం

- Advertisement -
- Advertisement -

ప్రైవేటు యూనివర్సిటీలలో బిసిలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలి
ఆర్.కృష్ణయ్య డిమాండ్

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో మెగా డిఎస్‌సి ద్వారా పె ద్ద ఎత్తున టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం పట్ల జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యకులు ఆర్ కృష్ణయ్య హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయంలో మెగా డిఎస్‌సి ప్రకటించి 25వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని 650 సార్లు ధర్నాలు, సభలు సమావేశాలు జరిపినట్లు కృష్ణయ్య తెలిపారు. 10 వేల మందితో రెండుసార్లు ర్యాలీలు నిర్వహిస్తే గత ప్రభుత్వం 70 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిందని విమర్శించారు. చివరకు నామమాత్రంగా 5,500 పోస్టులు ప్రకటించి చేతులు దులుపుకున్నారన్నారు.

విద్యానగర్ నగర్ బిసి భవన్ లో ఆదివారం జాతీయ బిసి సంక్షేమ సంఘం సమావేశం జరిగింది. గుజ్జ సత్యం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కృష్ణయ్య మట్లాడుతూ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులు అడగకుండానే ఉద్యమాలు చేయకుండానే మెగా డిఎస్‌సి ప్రకటించడం హర్షించ దగ్గ విషయమని అన్నారు. ప్రైవేటు యూనివర్సిటీలలో ఎస్‌సి, ఎస్‌టి రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించడం హర్శించదగ్గవిషయమని అన్నారు. బిసిలకు కూడా ప్రైవేటు యూనివర్సిటీలలో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. టీచర్ పోస్టుల సంఖ్య విషయంలో అధికారులపై ఆధారపడకుండా నిరుద్యోగ సంఘాలు, ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి సమావేశం జరిపి చర్చలు జరపాలని కృష్ణయ్య కోరారు. ప్రభుత్వ పాఠశాలలో 25 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పిఆర్‌సి కమిటీ నివేదికలో పేర్కొన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

తెలంగాణలోని ప్రాథమిక పాఠశాలల్లో 18 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పార్లమెంటు సాక్షిగా ప్రకటించారని గుర్తు చేశారు. 13 వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని గత ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించిందని కృష్ణయ్య గుర్తు చేశారు. 25 వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయన్నారు. 16 వేల విద్యా వాలంటీర్‌లను రెండు సంవత్సరాల క్రితం నియమించారని తెలిపారు. ఇప్పుడు కూడా 16 వల స్పెషల్ టీచర్లను నియమించడానికి ఆర్థిక శాఖ ఆమోదించిందని, పోస్టులు ఖాళీగా లేకపోతే ఈ స్పెషల్ టీచర్లు ఎందుకని ఆయన ప్రశ్నించారు. 10 వేల మంది సెకండరీ గ్రేడ్ టీచర్లకు స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లు ఇస్తే ఇంకో 10వేల పోస్టులు వస్తాయన్నారు. టీచర్ పోస్టులు భర్తీ చేయకపోవడంతో 16 వేల పాఠశాలల్లో ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ పాఠాలు చెప్పేవారు లేరని తెలిపారు. దీంతో బేసిక్ విషయ పరిజ్ఞానం లేక జాతీయ పోటీ పరీక్షల్లో, ఇంటర్, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర పోటీ పరీక్షలలో ఇతర రా్రస్ట్రాలతో పోటీ పడలేకపోతున్నారని కృష్ణయ్య పేర్కొన్నారు.

వాస్తవంగా ఎన్ని ఖాళీలు ఉన్నాయో లెక్కించాలని, గత 5 సంవత్సరాల కాలంలో ఎంత మంది రిటైర్ అయ్యారు? ఎంత మంది ప్రమోషన్లు పొందారు. ఇతర కారణాలతో ఎన్ని ఖాళీలు ఏర్పడ్డాయి. లెక్కించి భర్తీ చేయాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బిసి నాయకులు గుట్ట సత్యం. గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్, అంజి, అనంతయ్య, రాజేందర్, సుదేశ్, ఉదయ్, జయంతి, లింగయ్య యాదవ్, నిఖిల్, ఈలేశయ్య, ప్రియా, దుర్గా రాణి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News