Tuesday, May 14, 2024

ఈసారి రంజీ ట్రోఫీ ఉండదు..!

- Advertisement -
- Advertisement -

ఈసారి రంజీ ట్రోఫీ ఉండదు!
దాని స్థానంలో విజయ్ హజారె ట్రోఫీ
రాష్ట్ర క్రికెట్ సంఘాలకు బిసిసిఐ లేఖ

BCCI

ముంబై: కరోనా నేపథ్యంలో ఈసారి సుదీర్ఘ ఫార్మాట్‌లో జరిగే రంజీ ట్రోఫీని నిర్వహించకూడదని భారత క్రికెట్ బోర్డు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. రంజీ ట్రోఫీకి బదులు దాని స్థానంలో విజయ్ హజారె వన్డే టోర్నమెంట్‌ను నిర్వహించే యోచనలో బిసిసిఐ ఉన్నట్టు సమాచారం. ఈ విషయంలో రాష్ట్ర క్రికెట్ సంఘాల అభిప్రాయాలను తెలుసుకునేందుకు భారత క్రికెట్ బోర్డు కార్యదర్శి జై షా నడుంబిగించారు. ఈ మేరకు జైషా ఆయా క్రికెట్ సంఘాలకు లేఖ కూడా రాసి అభిప్రాయాలు తెలపాలని కోరారు. దాదాపు ఏడాది కాలంగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మరి పూర్తిగా తగ్గక పోవడంతో క్రికెటర్ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి రంజీ ట్రోఫీని నిర్వహించక పోవడమే మేలనే నిర్ణయానికి బిసిసిఐ వచ్చినట్టు తెలిసింది. అయితే రంజీ ట్రోఫీ జరపక పోయినా దాని స్థానంలో వన్డే ఫార్మాట్‌లో జరిగే విజయ్ హజారే ట్రోఫీని నిర్వహించేందుకు బిసిసిఐ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సుదీర్ఘ రోజుల పాటు సాగే రంజీ ట్రోఫీతో పోల్చితే వన్డేలను నిర్వహించడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావని బిసిసిఐ పెద్దలు భావిస్తున్నారు. ఇక రాష్ట్ర సంఘాల నుంచి అభిప్రాయాలు అందిన తర్వాత దీనిపై బిసిసిఐ అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది.

BCCI to organise Vijay Hazare Trophy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News