Tuesday, May 14, 2024

వరద నీటిపై అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: భారీగా కురుస్తున్న వర్షాలతో ఎగువ నుండి లోయర్ మానేరు డ్యాంలోకి వచ్చి చేరుతున్న వరద నీటిపై ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ తెలిపారు. శుక్రవారం ఉదయం లోయర్ మానేరు డ్యాం ప్రధాన గేట్ల వద్ద నీటి సామర్ధాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారీగా కురుస్తున్న వర్షాలతో ఎగువ నుండి మానేరు డ్యాంలోకి నీరు వచ్చి చేరుతుందని, భారీగా నీరు వచ్చి ప్రమాదస్థాయిని దాటినట్లయితే మానేరు గేట్లను ఎత్తడానికి తగిన ఏర్పాట్లతో అధికారులు సిద్దంగా ఉండాలని, లోతట్టు ప్రాంతం ప్రజలు, అధికారులను అప్రమత్తం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ ఎస్‌ఈ శివకుమార్, ఈఈ నాగభూషణం, తహసిల్దార్ సుధాకర్, ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News