Tuesday, May 7, 2024

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -
- Advertisement -

మహాదేవపూర్: ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెల్త్ సూపర్ వైజర్ మశూక్ అలీ అన్నారు. మంగళవారం మండలంలోని అంబటిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సూరారం గ్రామ వాడవాడలలో పర్యటించి ప్రజలకు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అనారోగ్యంతో బాధపడేవారికి ఉచిత మందులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలిక రోగాలతో ఉన్న వారికి క్రమం తప్పకుండా ఇచ్చిన మందులు వేసుకోవాలని సూచనలు చేసి, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రామంలోని వీధులలో నిలిచి ఉన్న నీటిని నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు.

నీరు నిల్వ ఉండడం వలన దోమల వృద్ధి చెంది జ్వరాలు వస్తాయన్నారు. వంట పాత్రలు ప్లాస్టిక్ డబ్బాలు, కొబ్బరి చిప్పలు, సీసాలు, టైర్లులో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, ఇంటి పరిసరాలలో ఉంచుకోకూడదని, గ్రామ పంచాయతీ చెత్త వాహనం వచ్చినప్పుడు అందులో వేయాలన్నారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉండే విధంగా చూసుకొని సీజనల్ వ్యాధుల బారిన పడకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మశూక్ అలీ, హెచ్‌ఎస్ సత్యనారాయణ, హెచ్‌ఏ కనుకదుర్గ, ఏఎన్‌ఎంలు శైలజ, శ్రీదేవి, ఆశాలు సారక్క, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News