Tuesday, October 15, 2024

బెంగళూరు రేవ్ పార్టీ కేసు.. నటి హేమకు షాక్!

- Advertisement -
- Advertisement -

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బెంగళూరు పోలీసులు 1086 పేజీల ఛార్జ్ షీట్ నమోదు చేశారు. నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు అందులో పేర్కొన్నారు. ఆమె ఎండిఎంఏ డ్రగ్స్ తీసుకున్నట్లు మెడికల్ రిపోర్టును జతపరిచారు. మొత్తం 9 మంది రేవ్ పార్టీని నిర్వహించారని, హేమతో పాటు 88 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తెలిపారు.

అయితే.. తానునే ఎక్కడా డ్రగ్స్ తీసుకోలేదని నటి హేమ చెబుతున్నారు. “బెంగళూరు పోలీసుల ఛార్జిషీట్‌లో నా పేరు వచ్చినట్టు తెలిసింది. నేను డ్రగ్స్ తీసుకున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం.. ఛార్జిషీట్‌ నాకు వచ్చాక నేను స్పందిస్తాను.నాకు ఉన్న సమాచారం మేరకు డ్రగ్స్ రిపోర్ట్‌లో నెగిటివ్ అని ఛార్జిషీట్‌లో వేశారు” నటి హేమ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News