Sunday, August 10, 2025

గాజాను స్వాధీనం చేసుకోం:నెతన్యాహు

- Advertisement -
- Advertisement -

గాజాను స్వాధీనం చేసుకుంటామని ఇటీవల ప్రకటించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తాజాగా మాట మార్చారు. తాము గాజాను ఆక్రమించుకోబోమని, హమాస్ నుంచి స్వేచ్ఛ కల్పిస్తామని ప్రకటించారు. గాజాను తాము స్వాధీనం చేసుకుని, అభివృద్ధి చేస్తామని ఇటీవల నెతన్యాహు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనకు ఇజ్రాయెల్ భద్రతా క్యాబినెట్ సైతం ఆమోదం తెలపడంతో ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఐక్యరాజ్యసమితితోపాటు పలు దేశాలు ఇజ్రెయల్ కుయుక్తులను తీవ్రంగా ఖండించాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ తాజాగా ఒక ప్రకటన చేస్తూ గాజాపై హమాస్ తోపాటు పాలస్తీనా అథారిటీకి కూడా ప్రమేయం లేకుండా పౌరపాలన వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. అదే సమయంలో గాజాను నిస్సైనికీకరణ చేస్తామని, దీనివల్ల భవిష్యత్తులో ఇజ్రాయెల్ కు గాజానుంచి ఎలాంటి ముప్పు తలెత్తకుండా ఉంటుందని నెతన్యాహు ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News