Thursday, May 2, 2024

భారత్ బయోటెక్ మరో ముందడుగు

- Advertisement -
- Advertisement -

Bharat Biotech Covaxin Gets Approval for Trials

హైదరాబాద్: కొవాగ్జిన్ టీకా విషయంలో భారత్ బయోటెక్ మరో ముందడుగు వేసింది. భారత్ బయోటెక్ కోవిడ్-19 వ్యాక్సిన్ కొవాగ్జిన్ రెండు నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారిపై దశ ఫేజ్-2, ఫేజ్-3 క్లినికల్ ట్రయల్ కోసం నిపుణుల బృందం మంగళవారం సిఫారసు చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కోవిడ్ పై సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ (ఎస్‌ఇసి) మంగళవారం భారత్ బయోటెక్ దరఖాస్తుపై చర్చించింది. 2 నుంచి 18 ఏళ్ల వయస్కులపై టీకా క్లినికల్ ట్రయల్స్ కు అనుమతిచ్చింది. పూర్తిస్థాయి చర్చల అనంతరం భారత్ బయోటెక్ విజ్జప్తిని నిఫుణుల కమిటీ పరిశీలించింది. 525 మంది 2 నుంచి 18ఏళ్ల వారిపై క్లినికల్ ట్రయల్స్ జరపనున్నారు. ఢిల్లీ, పట్నా, ఎయిమ్స్,నాగ్ పూర్ మెడిట్రినా సంస్థలో ట్రయల్స్ జరగనున్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) సహకారంతో భారత్ బయోటెక్ దేశీయంగా అభివృద్ధి చేసిన కోవాక్సిన్, భారతదేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 టీకా డ్రైవ్‌లో ఉపయోగపడుతున్న విషయం తెలిసిందే.

Bharat Biotech Covaxin Gets Approval for Trials

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News