Sunday, April 28, 2024

వాటే బ్యూటీ

- Advertisement -
- Advertisement -

Bheeshma

 

నితిన్, రష్మిక మందన జంటగా ‘ఛలో’ ఫేం వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భీష్మ’. తాజాగా ఈ సినిమా నుండి మరో కొత్త పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్‌లో నితిన్, రష్మిక జంట రొమాన్స్ పీక్స్‌కి చేరుకుందని అర్థమవుతోంది. భీష్క కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తూ రష్మిక సమ్‌థింగ్ హాట్‌గా కనిపిస్తోంది. ఆ టోన్డ్ లెగ్స్, పొట్టి మిడ్డీని చూస్తే కుర్రకారు గుండెలు జిల్ మనడం ఖాయం. ఈ పోస్టర్ చూస్తే పర్‌ఫెక్ట్ రొమాంటిక్ కపుల్ అనిపిస్తుంది.

ఇప్పటివరకు వచ్చిన పోస్టర్లు, టీజర్ ప్రతీది సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇక తాజాగా ‘భీష్మ’ పాటల ప్రమోషన్ మొదలైంది. తొలి సింగిల్ ‘వాటే బ్యూటీ…’ ఈనెల 31న విడుదల కానుంది. అందుకు సంబంధించిన పోస్టర్ జెట్ స్పీడ్‌తో యువతరంలో వైరల్ అయిపోతోంది. ఇంతకుముందు రిలీజైన సింగిల్స్ ఆంథెమ్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు ‘వాటే బ్యూటీ…’ అంటూ రొమాంటిక్ సాంగ్‌ని రిలీజ్ చేయనున్నారు. ఫిబ్రవరి 21న ఈ సినిమా విడుదలయ్యే వరకు వరుసగా పాటల ట్రీట్ ఉంటుందని తెలిసింది.

Bheeshma movie poster release
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News