Tuesday, May 7, 2024

జర్నలిస్టుపై నోరుపారేసుకున్న బైడెన్

- Advertisement -
- Advertisement -

Biden lashes out at journalist

 

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జర్నలిస్టుపై నోరుపారేసుకున్నారు. జనవరి 24న శ్వేతసౌధంలో ఇది జరిగింది. ఈస్ట్ రూమ్‌లో కాంపిటీషన్ కౌన్సిల్ సమావేశంలో ధరల తగ్గింపు చర్చ జరుగుతోంది. మీడియా ప్రతినిధులు వరుసగా బైడెన్‌కు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ క్రమంలో కన్జర్వేటివ్ పార్టీ ప్రొ ఛానెల్ ఫాక్స్ న్యూస్‌లో పని చేస్తున్న పీటర్ డూసీని ఉద్దేశించి బైడెన్ అభ్యంతరకర పదం వాడారు. ‘వాట్ ఏ స్టుపిడ్’ అని తిట్టేశాడు . అయితే ఈ ఘటన జరిగిన గంట తర్వాత వ్యక్తిగతంగా డూసీకి కాల్ చేసి బైడెన్ క్షమాపణలు చెప్పారు. దీన్ని డూసీ కూడా ధృవీకరించారు. ‘అది వ్యక్తిగతంగా చేసిన కామెంట్ కాదని’ బైడెన్ వివరణ ఇచ్చినట్లు వెల్లడించారు. జనవరి 24న వైట్‌హౌజ్‌లో కాంపిటీషన్ కౌన్సిల్ భేటీ జరిగింది. అనంతరం జరిగిన ప్రెస్‌మీట్‌లో పీటర్ డూసీ, అధ్యక్షుడు బైడెన్‌ను ద్రవ్యోల్బణంపై ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నతో కోపాన్ని అణుచుకోలేక వెటకారంగా ‘ద్రవ్యోల్బణం గొప్ప ఆస్తి’ అంటూ వెటకారంగా సమాధానమిస్తూనే ‘వాట్ ఏ స్టుపిడ్ ’ అనేశారు. అప్పటికీ మైక్ ఆన్‌లో ఉంది. అది గమనించని బైడెన్ ఆ తర్వాత సిబ్బంది విషయం చెప్పడంతో నాలిక్కరుచుకున్నారు. అయితే డూసీ సైతం ఆ కామెంట్లను సరిగ్గా వినలేకపోయాడట. ఆపై బ్రీఫ్ రూంలో తోటి పాత్రికేయులు చెప్పడంతో కాస్త మనస్తాపానికి గురైనట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News