Thursday, May 2, 2024

ఐపిఎల్ జరగకపోతే భారీ నష్టం ఖాయం!

- Advertisement -
- Advertisement -

IPL

 

ముంబై: కరోనా రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో ఈ సారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) నిర్వహించే అవకాశాలు అడుగంటుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఐపిఎల్ జరగడం దాదాపు అసాధ్యంగా మారింది. కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకుని భారత క్రికెట్ బోర్డు ఐపిఎల్‌ను నిరవాధికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. పరిస్థితులు మాములుగా మారే వరకు ఐపిఎల్ నిర్వహించే విషయం గురించి ఆలోచించే ప్రశ్నే లేదని స్పష్టం చేసింది. ముంబైతో సహా పలు నగరాల్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఇలాంటి స్థితిలో ఐపిఎల్ నిర్వహణ గురించి ఆలోచించడం కూడా సాహసమే అవుతోంది. మరోవైపు విదేశీ క్రికెటర్లు, కొన్ని ఫ్రాంచైజీలు, అభిమానులు మాత్రం ఐపిఎల్‌పై ఆశలను సజీవంగా ఉంచుకున్నారు. ఏడాది చివరిలోనైనా ఐపిఎల్ జరుగుతుందనే నమ్మకంతో వారున్నారు. కానీ, పరిస్థితులు మాత్రం వీరి ఆలోచనలకు భిన్నంగా ఉన్నాయి. ఈసారి ఐపిఎల్ జరిగే అవకాశాలు ఐదు శాతం కూడా లేవంటే అతిశయోక్తి కాదు.

పరిస్థితులు క్లిష్టంగా మారడంతో చాలా రాష్ట్రాలు ఐపిఎల్ నిర్వహణకు ముందుకు వచ్చే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. విదేశాల్లో కూడా ఐపిఎల్ నిర్వహించడం సాధ్యం కాక పోవచ్చు. ఇలాంటి స్థితిలో ఐపిఎల్ రద్దు కావడం ఖాయమనే చెప్పాలి. ఒక వేళ ఈసారి ఐపిఎల్ పూర్తిగా రద్దయితే మాత్రం నిర్వాహకులకు వేలాది కోట్ల రూపాయల నష్టం ఖాయం. టోర్నీ నిర్వహణ సాధ్యం కాక పోతే ఎంత లేదన్న ఐదు వేల కోట్ల రూపాయల ఆర్థిక నష్టం తప్పదని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇది క్రికెటర్లకు, ఫ్రాంచైజీలకు, స్పాన్సర్లకు, బిసిసిఐకి, బ్రాడ్‌కాస్టర్లకు పెద్ద మొత్తంలో ఆర్థిక కలిగిస్తోందని వారు హెచ్చరిస్తున్నారు. ఇక, ఈసారి వేలం పాటలో భారీ మొత్తానికి అమ్ముడు పోయిన క్రికెటర్లకు ఇది ఆవేదన కలిగించే అంశంగా చెప్పాలి. కోట్లాది రూపాయలు వెచ్చించి ఆయా ఫ్రాంచైజీలు స్టార్ క్రికెటర్లను సొంతం చేసుకున్నాయి. ఐపిఎల్ పూర్తిగా రద్దయితే క్రికెటర్లకు ఒక్క రూపాయి కూడా లభించదు. ఇది కమిన్స్‌తో సహా చాలా మంది ఆటగాళ్లకు పెద్ద ఎదురు దెబ్బగానే పరిగణించవచ్చు.

 

Biggest loss if IPL doesn’t happen
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News