Saturday, May 4, 2024

గ్లామర్ డోస్ పెంచింది

- Advertisement -
- Advertisement -

Avika Gor

 

‘ఉయ్యాల జంపాల’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ముద్దుగుమ్మ అవికా గోర్. అంతకు ముందే ‘చిన్నారి పెళ్లి కూతురు’ అనే డబ్బింగ్ సీరియల్‌తో తెలుగునాట బుల్లితెర ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసిన అవిక ఆ తర్వాత వెండితెరపైనా ఓ వెలుగు వెలిగింది. చెప్పుకోవడానికి సంఖ్యా పరంగా బాగానే సినిమాలు చేసినా అందులో కొన్ని సక్సెస్‌లు ఉన్నా& ఎందుకో ఈ బ్యూటీకి రావాల్సిన స్థాయిలో స్టార్‌డమ్ రాలేదు. బహుశా గ్లామర్ పరంగా పెట్టుకున్న కట్టుబాట్లే దానికి కారణం కావచ్చని ఈ బ్యూటీ అనుకుందేమో.

దీంతో చాలా కష్టపడి తన బొద్దు అవతారాన్ని మార్చి స్లిమ్‌గా తయారైంది. ఈ క్రమంలో తనకు ‘ట్రోలింగ్’ కూడా ఉపయోగపడిందని చెబుతోంది అవికా గోర్. తన గ్లామర్ గురించి చాలా ట్రోల్స్ చూశాననీ… ఈ నేపథ్యంలోనే తనను తాను పూర్తిగా మార్చేసుకోవాలనుకున్నానని అవికా గోర్ పేర్కొంది. ఇక ఇప్పుడు స్లిమ్‌గా మారిన ఈ బ్యూటీ కొంచెం గ్లామర్ డోస్ కూడా పెంచింది. తన గ్లామర్‌ను చూపిస్తూ సోషల్ మీడియాలో హాట్ హాట్‌గా దర్శనమిస్తోంది అవికా గోర్. అయితే కరోనా లాక్‌డౌన్‌తో ఇంట్లోనే ఉంటున్న తాను డ్యాన్స్ ప్రాక్టీస్, స్విమ్మింగ్ చేస్తూ సన్నబడ్డానని పేర్కొంది ఈ యంగ్ బ్యూటీ.

 

Avika Gor is Appearing as Hot
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News