Tuesday, April 30, 2024

జూన్ 2న గోల్కొండ కోటలో దశాబ్ధి వేడుకలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఉగ్రవాదం,ఐఎస్‌ఐని ఉక్కుపాదంతో కేంద్ర ప్రభుత్వం అణచివేసిందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్ సెంట్రల్, మహంకాళి సికింద్రాబాద్ జిల్లాల బిజెపి కార్యవర్గ సమావేశాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.- హైదరాబాద్‌లో గతంలో బాంబు దాడులు జరిగాయి. పాకిస్థాన్ వాళ్లు చంపేవాళ్లు.. మనం చచ్చేవాళ్లం అన్నట్టుగా ఉండేది. కానీ ఈ రోజు దేశంలో ఎక్కడా పాకిస్థాన్ ఉగ్రవాద దాడులు లేవు. మోడీ పాలనలో రెండు సంఘటనలు జరిగితే.. మన సైనికులు సర్జికల్ స్ట్రైక్స్ చేసి పాక్ భూభాగంలోకి వెళ్లి కారకులను తుదమొట్టించి కొత్త చరిత్ర నెలకొల్పారని గుర్తుచేశారు.- కాంగ్రెస్ పాలనలో 10 లక్షల కోట్ల కుంభకోణం జరిగింది. ఇది మనం చెబుతున్న విషయం కాదు.. కాగ్, సుప్రీంకోర్టులు చెప్పాయని వెల్లడించారు.

తొమ్మిదేండ్లలో ఒక్క రూపాయి అవినీతి లేకుండా.. ప్రభుత్వాన్ని నడుపుతున్న వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. ఒకప్పుడు జెండా ఎగురవేయడానికే ఇబ్బంది ఉండేది. కానీ నిన్నటి జీ20 సదస్సు సందర్భంగా శ్రీనగర్ మొత్తం జాతీయ జెండాలతో నిండిపోయింది.- ఒకప్పుడు పోలీసులు, సైనికులు కనబడితే జమ్మూకాశ్మీర్‌లో రాళ్లు పడేవి. ఇప్పుడు పోలీసులు, సైనికులను చూసి అక్కడి ప్రజలు ధైర్యంగా ఉంటున్నారు. శ్రీనగర్‌లో జీ 20 సదస్సు పెడితే చైనా సహా కొన్ని దేశాలు అభ్యంతరం చెప్పాయి. కానీ ప్రధాని మోడీ అన్ని దేశాలతో మాట్లాడారు. 28 దేశాల ప్రతినిధుల్లో ఒక్క చైనా మినహా అందరూ వచ్చి శ్రీనగర్‌ను చూసి మురిసిపోయారు. ఈ నెల 30 నుంచి జూన్ 30 వరకు దేశవ్యాప్తంగా జరిగే ‘మహాజన్ సంపర్క్ అభియాన్’ కార్యక్రమంపై వర్క్ షాప్ నిర్వహిస్తున్నామని తెలిపారు.- దేశంలోని సాధారణ గిరిజన కుటుంబంలోని వ్యక్తిగత మరుగుదొడ్డి నుంచి మొదలు పెడితే.. అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుల నిర్మాణం వరకు మోడీ ప్రభుత్వం ఎన్నో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నదని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News