Tuesday, April 30, 2024

బిజెపిలో ప్రచార కమిటీ పదవి లేదు: జితేందర్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జితేందర్ రెడ్డి నివాసంలో బిజెపి ముఖ్యనేతలు భేటీ ముగిసింది. ఈ సమావేశంలో వివేక్, జితేందర్ రెడ్డి, విజయశాంతి, విఠల్, బూర నర్సయ్య గౌడ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రవీంద్ర నాయక్, దేవయ్య పాల్గొన్నారు. పార్టీలో మార్పులు, చేర్పులపై ప్రధానం చర్చించినట్లు తెలుస్తోంది. టార్గెల్ ఈటలగా సమావేశం కొనసాగినట్లు సమాచారం. పార్టీలో కీలక నేతల పదవుల మార్పు లీక్స్ పై సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా బిజెపి నేత, మాజీ ఎంపి జితేందర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ… బిజెపి కార్యకర్తల్లో అయోమయం సృష్టించేదుకు సిఎం కెసిఆర్ కొన్ని లీక్స్ వదులుతున్నారని జితేందర్ రెడ్డి ఆరోపించారు. పార్టీలో గందరగోళం సృష్టించేందుకే కెసిఆర్ కుట్ర చేశారని ఆయన వెల్లడించారు. కెసిఆర్ దృష్ఫ్రచారాన్ని తిప్పికొడుతామన్నారు. కెసిఆర్ లీక్స్ పై సమావేశంలో చర్చించామన్నారు. లీక్స్ పై పార్టీ కేడర్ కు మెసేజ్ పంపేందుకే ఈ భేటీ జరిపినట్లు స్పష్టం చేశారు. కార్యకర్తల దృష్టి మరల్చేందుకే కెసిఆర్ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కెసిఆర్ లీక్స్ ను కార్యకర్తలు పట్టించుకోవద్దని ఆయన పిలుపునిచ్చారు.

బిజెపిలో ప్రచార కమిటీ పదవి లేదని తెలిపారు. తమది జాతీయ పార్టీ.. తమకు ఓ విధానం ఉంటుంది. రాష్ట్ర పార్టీ నేతలతో చర్చించకుండా అధిష్టానం నిర్ణయం తీసుకోదన్నారు. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ను మారుస్తారని కెసిఆర్ ప్రచారం చేయిస్తున్నారు. పొంగులేటి, జూపల్లిని బిజెపిలో చేరాలని కోరుతున్నాం. తెలంగాణ బిజెపిలో ఎలాంటి అసంతృప్తి లేదు. పార్టీ బలోపేతంపై సమావేశంలో చర్చించామని జితేందర్ రెడ్డి వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News