Saturday, April 27, 2024

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిజెపిలో చేరనున్నారా..?

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: బీఆర్ఎస్ మాజీ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరే అవకాశాలున్నట్లు ఊహాగానాలు జోరందుకున్నాయి. తెలంగాణ బీజేపీ నేత ఈటల రాజేందర్, రఘునందన్ రావు ఇతర పార్టీల నేతలతో కలిసి గురువారం ఖమ్మం జిల్లాలోని పొంగులేటిని ఆయన నివాసంలో కలుసుకున్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పొంగులేటితో గత కొద్ది రోజులుగా టచ్‌లో ఉన్నట్లు సమాచారం.

పొంగులేటితో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి భేటీలో ఉన్నారని తెలుస్తోంది. బిజెపి నేతలు ఖమ్మం జిల్లాలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. పొంగులేటి 2014 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సిపి టిక్కెట్‌పై ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. అయితే ఆయన తన అనుచరులతో కలిసి 2016 మేలో టిఆర్‌ఎస్ (ప్రస్తుతం బిఆర్‌ఎస్)లో చేరారు. అయితే 2019 ఎన్నికల్లో ఖమ్మం నుంచి ఆయనకు పార్టీ టిక్కెట్ నిరాకరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News