Wednesday, May 22, 2024

నన్ను, నా మేనల్లుడిని టార్గెట్ చేసిన బీజేపీ : మమతా బెనర్జీ

- Advertisement -
- Advertisement -

నన్ను, నా మేనల్లుడు, టిఎంసి ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీని బీజేపీ టార్గెట్ చేసిందని, తాము సురక్షితంగా లేమని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఆదివారం ఆరోపించారు. అసెంబ్లీలో విపక్ష నాయకుడైన సువేందు అధికారి సోమవారం పెద్ద విస్ఫోటనం జరుగుతుందని, అది టిఎంసిని , దాని అగ్రనేతలను ఊపేస్తుందని ఆరోపించిన మరునాడు మమతా బెనర్జీ దానికి దీటుగా స్పందించారు. బీజేపీ మమ్మల్ని టార్గెట్ చేసినా, కాషాయం పార్టీ కుట్రకు తాము భయపడబోమని ఆమె దీటుగా జవాబిచ్చారు. టిఎంసి నాయకులకు, పశ్చిమబెంగాల్ ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్న కు ట్రను ఎదుర్కోడానికి ప్రతి ఒక్కరూ రక్షణగా ఉండాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.బలూర్‌ఘాట్ లోక్‌సభ స్థానం టిఎంసి అభ్యర్థి, రాష్ట్ర మంత్రి బిప్‌లాబ్ మిత్రాకు మద్దతుగా కుమార్‌గంజ్‌లో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో మమతా బెనర్జీ మాట్లాడారు.

ఒక ద్రోహి తన కుటుంబాన్ని, అక్రమ సంపాదనను కాపాడుకోడానికి బీజేపిలో చేరాడని, చాక్లెట్ బాంబు పేలుతుందని అతడుచేసిన బెదిరింపును గట్టిగా తాము ఎదుర్కొంటామని హెచ్చరించారు. పటాకులు పేల్చి అతణ్ని ఎదుర్కొంటామని, పటాకులు అంటే పిఎం కేర్‌ఫండ్ కేటాయింపులో పక్షపాతం, ప్రతిపౌరుని బ్యాంకు అకౌంట్‌లో రూ. 15 లక్షలు జమ చేస్తామని ‘జుమ్లా ’ హామీ ఇవే పటాకులుగా ఆమె వ్యాఖ్యానించారు. దూరదర్శన్ లోగో రంగు మార్పు గురించి విమర్శిస్తూ ఆ లోగోకు కాషాయం రంగు వేయడం, కొన్ని తరాలుగా దేశంలో త్యాగాలు చేసిన మహర్షులు, ఆథ్యాత్మిక వేత్తలను అవమానించడమేనని ఎద్దేవా చేశారు. ఎన్నికల సందర్భంగా దూరదర్శన్ లోగోను కాషాయం రంగుగా మార్చడం బీజేపీ మత ఆధార ఓటుబ్యాంకు రాజకీయాలకు, ఎజెండాకు సరిపోతుందని వ్యాఖ్యానించారు.

డిడిలోగో అకస్మాత్తుగా ఎందుకు కాషాయం రంగుగా మార్చారు? ఆర్మీ అధికారుల నివాసాలకు కాషాయం రంగు వేయించారు? కాశీ లోని పోలీస్‌ల యూనిఫాంను కాషాయం రంగుతో ఎందుకు మార్చారు; అని మమత ప్రశ్నించారు. దూరదర్శన్ లోగో రంగు మార్పును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, బీజేపీ నిరంకుశ పాలనకు ఇది మరో ఉదాహరణ అని బెనర్జీ తీవ్రంగా ధ్వజమెత్తారు. బీజేపీ మళ్లీ అధికారం లోకి వస్తే భవిష్యత్తులో రాజకీయాలే ఉండబోవని, ఒకే నాయకుడు, ఒకే పార్టీ పాలనే ఉంటుందని , వివిధ సమాజాల మతపరమైన హక్కులు ప్రమాదంలో పడతాయని మమతా బెనర్జీ హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News