Sunday, October 1, 2023

బిజెపి వంద అబద్దాలు… బుక్ లెట్, సిడిని ఆవిష్కరించిన మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్లు చేపట్టిన బిజెపి వంద అబద్దాలు క్యాంపెయిన్‌ను అభినందించిన మంత్రి

బిజెపి తప్పులను, వైఫల్యాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లి  వాస్తవాలను గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు తెలిసేలా చేయాలని సూచన

మనతెలంగాణ/హైదరాబాద్ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ వైఫల్యాలను, తెలంగాణకు చేసిన అన్యాయాలను వివరిస్తూ బిఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియా విభాగం రూపొందించిన బిజెపి వంద అబద్దాలు బుక్ లెట్, సిడిని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు సోమవారం ప్రగతిభవన్‌లో ఆవిష్కరించారు. బిఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియా విభాగం నాలుగు నెలలుగా బిజెపి వైఫల్యాలను బట్టబయలు చేస్తూ వస్తోంది. బిఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్లుగా ఉన్న మన్నె క్రిషాంక్, వై.సతీష్ రెడ్డి, జగన్ మోహస్ రావు, దినేష్ చౌదరి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దేశ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోడీ సర్కారు ఎలా మోసం చేసింది?.. తెలంగాణ ప్రజలకు హక్కుగా రావాల్సిన వాటిని ఎలా అడ్డుకుంటున్నారనే విషయాలను ఇందులో వివరించారు. బిజెపి తప్పులను ప్రతీరోజు బయటపెడుతున్నారు.

నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, భారంగా మారిన జిఎస్‌టి, ప్రతీ ఇంటికి ఇంటర్నెట్ సదుపాయం, అందరికీ ఇల్లు, విభజన హామీల అమలు, బయ్యారం స్టీల్ ప్లాంట్, ఐటిఐఆర్, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఎస్‌టి రిజర్వేషన్లతో పాటు.. బిజెపి నాయకుల అసలు రూపాన్ని ఈ క్యాంపెయిన్‌లో బయటపెట్టారు. బిఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్లు చేపట్టిన బిజెపి వంద అబద్దాలు క్యాంపెయిన్‌ను మంత్రి కెటిఆర్ అభినందించారు. అబద్దాల పునాదుల మీద రాజకీయం చేస్తున్న బిజెపి అసలు రూపాన్ని ప్రజల ముందు ఉంచారని వ్యాఖ్యానించారు. బుక్ లెట్, సిడి ద్వారా బిజెపి తప్పులను, వైఫల్యాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లి వాస్తవాలను గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు తెలిసేలా చేయాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎ వివేకానంద్ గౌడ్, ఎంపీ బిబి పాటిల్ పాల్గొన్నారు.

కేంద్ర మంత్రులు ఇచ్చిన హామీలు(అబద్దాలు):

1. నారాయణపేట్‌లో హ్యాండ్లూమ్ పార్క్(కేంద్ర హోం మంత్రి అమిత్ షా)
2. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ(కేంద్ర పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డి)
3. అదిలాబాద్‌లో సిమెంట్ ప్లాంట్ నిర్మాణం(కేంద్ర హోం మంత్రి అమిత్ షా)
4. తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టు నిర్మాణం(కేంద్ర పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డి)
5. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా(ప్రధాని మోడీ, మాజీ కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి)
6. బయ్యారం స్టీల్ ప్లాంట్ నిర్మాణం(మాజీ కేంద్ర మంత్రి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ)
7. మాదిగల న్యాయం చేస్తాం…ఎస్‌సి వర్గీకరణ చేస్తాం(మాజీ కేంద్రమంత్రి, మాజీ ఉపరాష్ట్రప్రతి ఎం.వెంకయ్యనాయుడు)
8. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు(కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, నిజామాబాద్ ఎంపి ధర్మపురి అర్వింద్ కుమార్)
9. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు(మాజీ కేంద్ర మంత్రి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ)
10. తెలంగాణలో సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ ఏర్పాటుకు ప్రధాని కార్యాలయం అనుమతి ఇచ్చింది(కేంద్ర పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డి)
11. తెలంగాణకు వరద సాయం అందించేందుకు కేంద్రం అంగీకారం(కేంద్ర పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డి)
12. ప్రతి రాష్ట్రంలో ఐఐఎం ఏర్పాటు చేయడం నా కల(ప్రధాని నరేంద్ర మోడీ)
13. నాగార్జునసాగర్‌లో కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం(కేంద్ర పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డి)
14. ప్రధాని మోడీ హామీ 2016లో ఇచ్చిన హామీ మేరకు హైదరాబాద్ మెట్రోకు రూ.16 వేల కోట్లు కేంద్రం ఇస్తుంది(కేంద్ర హోం మంత్రి అమిత్ షా)
15.ప్రధాని నరేంద్రమోడీ వెనుకబడిన జిల్లా అయిన సిద్దిపేటకు ఒక మెడికల్ కాలేజీ ఇచ్చారు(దుబ్బాక ఎంఎల్‌ఎ రఘునందన్‌రావు)
16. బిజెపి ప్రతి నియోజకవర్గానికి లక్ష ఇళ్లు నిర్మిస్తుంది(నిజామాబాద్ ఎంపి అర్వింద్‌కుమార్)
17. బిజెపి రూ.వెయ్యి కోట్లతో హుజురాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుంది(హుజురాబాద్ బిజెపి ఎంఎల్‌ఎ అభ్యర్థి కోట రామారావు)
18. కంటోన్మెంట్‌కు ఆర్మీ నుంచి రూ.700 కోట్లు ఇస్తాం(కరీంనగర్ ఎంపి బండి సంజయ్)
19. మోడీ ప్రభుత్వం సంక్రాంతి నుంచి బీడీ కార్మికులకు రూ.3 వేల పింఛన్ ఇస్తుంది.
20. కేంద్ర ప్రభుత్వం అదిలాబాద్‌కు కొత్త ఎయిర్‌పోర్టు మంజూరు చేస్తుంది(అదిలాబాద్ ఎంపి సోయం బాపురావు)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News