Friday, March 29, 2024

నాగాలాండ్, త్రిపురలో బిజెపిదే విజయం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మేఘాలయ, నాగాలాండ్, త్రిపురలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిని ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించాయి. త్రిపురలో కాషాయపార్టీ తమ అధికారాన్ని నిలబెట్టుకోవడంతోపాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. నేషనల్ డెమోక్రటిక్ ప్రొగెసివ్ పార్టీతో కలిసి బిజెపి అధికారాన్ని పంచుకోనుంది. అయితే మేఘాలయలో ఏ పార్టీకి తగిన మెజార్టీ లభించక హంగ్ అసెంబ్లీ ఏర్పడనుందని సోమవారం రాత్రి వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. ఎన్నికలు జరిగిన మూడు ఈశాన్య రాష్ట్రాల్లోని త్రిపురలో ఈ నెల ఎన్నికలు ముగిశాయి. రెండు రాష్ట్రాలు మేఘాలయ, నాగాలాండ్‌లో ఓటింగ్ సోమవారంతో ముగిసింది. మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర మూడింట ఒక్కో రాష్ట్రంలో 60అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

ఇండియాటుడేయాక్సిస్ మై ఇండియా అంచనా ప్రకారం త్రిపురలో బిజెపి, ఐపిఎఫ్‌టి కూటమి 45 స్థానాల్లో గెలుపొందనుంది. లెఫ్ట్ కూటమి 6నుంచి 11స్థానాల్లో విజయం సాధించనుంది. కాంగ్రెస్ వరుసగా రెండోసారి అయితే టైమ్స్ నౌఈటిజి రిసెర్చ్, జీన్యూస్‌మెట్రిజ్ మిశ్రమ ఫలితాలను వెల్లడించాయి. బిజెపి మెజార్టీకి కొద్దిదూరంలో నిలిచిపోతే వామపక్షాలు 1321 స్థానాల్లో విజయం సాధించి నిర్ణయాత్మక పాత్రను పోషిస్తాయని తెలిపాయి. టైమ్స్ నౌ బిజెపి గెలుస్తుందని తెలిపితే జీన్యూస్ 2936స్థానాలు గెలవవచ్చని భిన్నమైన ఫలితాన్ని తెలిపింది. అయితే ఈ రెండు సంస్థలు త్రిపురలో కాంగ్రెస్‌పార్టీ ఒక్క సీటు కూడా గెలవదని అంగీకరించాయి.

నాగాలాండ్‌లో బిజెపి విజయం ఖాయం

నాగాలాండ్‌లో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని ఎగ్జిట్‌పోల్స్ మూకుమ్మడిగా తెలిపాయి. ఇండియాటుడే, టైమ్స్ నౌ, తమ అంచనా ప్రకారం భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని వెల్లడించాయి. టైమ్స్ నౌ కథనం ప్రకారం బిజెపి కాంగ్రెస్ 0, నాగా పీపుల్స్‌ఫ్రంట్ నాలుగు నుంచి 8స్థానాలు గెలుచుకోనున్నాయి. జీన్యూస్ ప్రకారం ఎన్‌పిఎఫ్ రెండు నుంచి ఐదు స్థానాలు, ఇండియాటుడే ప్రకారం బిజెపి ఎన్‌పిఎఫ్ మూడు నుంచి ఎనిమిది స్థానాలు కైవసం చేసుకోనున్నాయి. కాగా జీన్యూస్, ఇండియాటుడే రెండూ కాంగ్రెస్ ఒకటి లేదా రెండుస్థానాలకే పరిమితం అవుతుందని తెలిపాయి.

మేఘాలయలో ఏపార్టీకి దక్కని మెజార్టీ

ప్రాథమిక ప్రకారం మేఘాలయలో హంగ్ అసెంబ్లీగా ఎగ్జిట్‌పోల్స్ పేర్కొన్నాయి. మెజార్టీ మార్కును సింగిల్‌పార్టీ కానీ కూటమి కానీ అందుకోలేవని తెలిపా యి. బిజెపి సొంతంగా మించి గెలవలేదు. జీన్యూస్ 6నుంచి 11, టైమ్స్ నౌ 3నుంచి 6స్థానాల్లో బిజెపి గెలుస్తుందని, కాంగ్రెస్ సింగిల్ డిజిట్‌కే పరిమితమని అయితే ఎన్‌పిపి స్థానాలు గెలుచుకున్న పార్టీగా అవతరించనుంది. టైమ్స్ నౌ అంచనా ప్రకారం జీన్యూస్ ప్రకారం 2126స్థానాలు నేషనల్ పీపుల్స్ పార్టీ గెలవనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News