Friday, March 29, 2024

భూమి వైపు కృష్ణబిలం చూపు

- Advertisement -
- Advertisement -

నక్షత్రమండలం (గెలాక్సీ) లోని బ్రహ్మాండమైన కృష్ణబిలం తన దిశను ఇప్పుడు భూమివైపు మార్చుకోవడంతో ఖగోళ శాస్త్రవేత్తలు ఆ నక్షత్ర మండలాన్ని తిరిగి వర్గీకరించారు. 657 మిలియన్ కాంతి సంవత్సరాలకు దూరంగా ఈ నక్షత్రమండలం కనబడింది. దీనికి పిబిసి జె 2333.92343 అని పేరు పెట్టారు. ఈ నక్షత్ర కూటమి (గెలాక్సీ) ప్రత్యేకమైన లక్షణాలు ప్రదర్శించడంతో దీన్ని అధ్యయనం చేయడం మొదలు పెట్టామని రాయల్ అస్ట్రానమికల్ సొసైటీ (ఆర్‌ఎఎస్)కు చెందిన డాక్టర్ లోరెనా హెర్మాండెజ్ పేర్కొన్నారు.

ఈ కృష్ణబిలం తన సాపేక్షదట్టమైన పొగవంటి వెల్లువ (relatiyistic jet) దిశ మారిందన్నది తమ సిద్ధాంతమని, దీన్ని నిర్ధారించుకోడానికి తాము అనేక విధాలైన పరిశోధనలు సాగిస్తున్నామని పేర్కొన్నారు. పరిశోధకులు తమ అధ్యయనంలో ఈ మార్పును వివరించారు. ప్రథమంగా ఈ గెలాక్సీని రేడియో గెలాక్సీగా వర్గీకరించారు. కానీ అంతరిక్ష దృగ్విషయాలు (space phenomina) 90 డిగ్రీల కోణంలో పరిభ్రమిస్తూ ఇప్పుడు తన కేంద్రాన్ని భూమి వైపు లక్షంగా పెట్టుకుందని అంటే దీని జెట్ ప్రవాహం భూమి దిశగా ఉంటోందని పరిశోధకులు వివరించారు.

కృష్ణబిలం నుంచి జెట్ వెల్లువ (jet material) పదార్థం గెలాక్సీకి ఇరువైపులా రెండు భారీ ఖండాలను ఏర్పర్చిందని, రేడియో ధార్మిక తరంగాలతో అధ్యయనం చేసినప్పుడు వీటిని తక్షణం గుర్తించవలసి ఉంటుందని చెప్పారు. ఈ విధంగా దిశ మారడానికి ఏది దోహదం చేసిందో తాము చెప్పలేమని పరిశోధకులు పేర్కొన్నారు. అయితే మరికొంతమంది ఖగోళ శాస్త్రవేత్తలు ఈ నక్షత్రమండలం (పిబిసి జె 2333.9 2343) వేరే నక్షత్రమండలం ( గెలాక్సీ)తో ఢీకొనడం వల్లనే దిశ మారిందని అంచనా వేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News