Sunday, April 28, 2024

ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు బాలీవుడ్ స్టార్

- Advertisement -
- Advertisement -

Bollywood star for pre-release function of RRR

 

రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రౌద్రం రణం రుధిరం. డివివి దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో అలియా భట్, ఒలివియా మోరిస్‌లు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అజయ్ దేవగణ్, శ్రియా శరణ్, సముద్ర ఖనిలు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్, కోమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదలై సెన్సేషన్ సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే.

ఇప్పుడు ఈ చిత్రం నుండి బుల్లెట్ నడుపుతున్న కొమురం భీమ్ ఫోటోను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. అదే విధంగా రామ్ చరణ్ స్టైలిష్‌గా నిలబడి ఉన్న ఫోటోను చిత్ర యూనిట్ షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తోంది. దీని ప్రకారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గెస్ట్‌గా రావడం ఖరారైనట్టు తెలిసింది. మరి దీనిపై ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఈ ఈవెంట్‌ని ముంబయ్‌లో భారీ లెవెల్‌లో ప్లాన్ చేస్తున్నారట.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News