Monday, May 13, 2024

నాంపల్లి పోచమ్మ ఆలయంలో వచ్చే 12 నుంచి బోనాల సంబరాలు

- Advertisement -
- Advertisement -

నాంపల్లి : నగర ప్రజల ఆధ్యాత్మికతకు తలమానికంగా నిలుస్తూ..ఈ ప్రాంత భక్తి సంస్కృతి, సంప్రదాయాల వైభవానికి ప్రతీకైన బోనాల సంబరాలు ఈ సారి అత్యంత ఘనంగా, భక్తి భావాలతో రెండు రోజుల పాటు నిర్వహించాలని నాంపల్లి శ్రీపోచమ్మ (ఏడుగుళ్లు) ఆలయ కమిటీ నిర్ణయించింది. ఆలయ పరిధిలో ఉన్న బస్తీలు, కాలనీ, ప్రాంతవాసులు, భక్తులు, ఆలయాల ప్రతినిధులతో కలిసి ఆదివారం ఆలయ కమిటీ ఛైర్మన్ సీహెచ్ ఆనందకుమార్ గౌడ్ సారధ్యంలో సమావేశం జరిగింది. ఈ మేరకు ఏటా ఆషాడ మాసం సందర్భంగా తెలంగాణ జనజీవన సంస్కృతికి ప్రతిబింబించేలా శ్రీ అమ్మవారి బోనాల ఉత్సవాలు వచ్చే జూలై 16, 17 తేదీల్లో జరపాలని ఆలయ కమిటీ తేదీలను అధికారికంగా ఖరారు చేసింది.

తొలుత వేడుకల్లో భాగంగా 12న సాయంత్రం అమ్మవారి సల్ల కుండ ఊరేగింపుతో ఉత్సవాలు శ్రీకారం జరగనున్నాయి. ఉత్సవాల నిర్వహణ సంబంధించి ఏ విధంగా సన్నాహాలు చేయాలి, బస్తీవాసుల సంపూర్ణ సహకారం, వివిధ ఆలయాల కమిటీ ప్రతినిధుల సమన్వయంతో వ్యవహరించడం, పూజాదికాలు వంటి అంశాల గురించి చర్చించారు. శ్రీ అమ్మవారి ఆలయానికి చారిత్రాత్మక నేపద్యం కల్గి ఉంది. నాటి నిజాం ఏలుబడి నుంచి బోనాల ఉత్సవాలు ధూంధంగా నిర్వహణకు వేదికగా నిలుస్తోంది. ఏటా క్రమం తప్పకుండా ఆలయంలో రంగరంగ వైభవంగా తలపెట్టడం అనవాయితీ.. ఆలయం పరిధిలో సుమారు 40 వరకు బస్తీలు, కాలనీలు ఉన్నాయి.

వారంతా ఏటా బోనాల వేడుకల్లో అమ్మవారికి భక్తులు సంప్రదాయంగా బోనాలు సమర్పణ, పూజాదికాలు, ఆకర్షణీయ తొట్టెల ఊరేగింపు వంటి నిర్వహించడం అనవాయితీ ఈ నేపధ్యంలో బోనాల ఉత్సవాల సన్నాహాక సమావేశంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్ ఆనందకుమార్ గౌడ్ మాట్లాడుతూ బోనాల ఉత్సవాలను భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఉత్సవాలు జూలై 12న శ్రీ అమ్మవారి సల్ల కుండ ఊరేగింపు ఉంటుంది. తొలుత మాతేశ్వరికి పూజలు, అర్చనలు, తర్వాత డప్పువాయిద్యాల మద్య భక్తి నినాదాలతో ఊరేగింపు ప్రారంభమై నాంపల్లి దర్గా, ఎక్‌మినార్, నాంపల్లి రైల్వేస్టేషన్, తెలుగువర్సిటీ, పబ్లిక్‌గార్డెన్స్‌రోడ్డులో బంగారు మైసమ్మ ఆలయానికి చేరుకుంటుందని ఆయన వివరించారు. అక్కడే అమ్మవారికి సల్ల్లకుండ సమర్పించి పూజలు నిర్వహించి తిరిగి శ్రీ పోచమ్మ ఆలయానికి చేరుకుంటామన్నారు. సమావేశంలో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌కుమార్ అగర్వాల్, కె. నరేందర్, బసవయ్య, సురేందర్ జైస్వాల్ వివిధ బస్తీలు, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News