Tuesday, May 21, 2024

రెండో రోజు పార్లమెంటును కుదిపేసిన మణిపూర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ:పార్లమెంటు వర్షాకాల సమావేశాలను మణిపూర్ అంశం కుదిపేస్తోంది. మణిపూర్ అల్లర్లు, తాజాగా వెలుగులోకి వచ్చిన మహిళలపై అమానుష ఘటనపై చర్చించాలని విపక్షాల పట్టుబట్టడంతో శుక్రవారం రెండో రోజు కూడా ఉభయ సభలు ఎలాంటి కార్యకలాలపాలు నిర్వహించకుండానే వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్‌సభ సమావేశం కాగానే ప్రతిపక్షాలు ఈ అంశంపై చర్చకు పట్టుబట్టాయి. వెల్‌లోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. ఈ అంశంపై చర్చకు ప్రతిపక్షాలు సహకరించాలని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో ఒక ప్రకటన చేస్తారని స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. అయినా విపక్షాలు తగ్గలేదు. ప్రధాని మోడీ ప్రకటన చేయాలని డిమాండ్ చేశాయి.

దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో క్షణాల వ్యవధిలోనే లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. సభ తిరిగి సమావేశమైన తర్వాత కూడాపరిస్థితుల్లో ఎలాంటి మార్పూ రాలేదు.విపక్ష సభ్యుల ఆందోళనలతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ ప్రకటించారు. అంతకు ముందు సభ ఉదయం సమావేశమయినప్పుడు మణిపూర్ ఘటనలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే ప్రతిపక్షం చర్చ విషయంలో సీరియస్‌గా ఉన్నట్లు కనిపించడం లేదని సభలో డిప్యూటీ నాయకుడు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ ఈ అంశంపై ప్రకటన చేయాలని పట్టుబడుతున్నాయి.
రాజ్యసభలోనూ అదే పరిస్థితి
అటు రాజ్యసభలోనూ దాదాపుగా అదే పరిస్థితి నెలకొంది. కొద్దిసేపు మాత్రం సభా కార్యకలాపాలు జరిగాయి. అనంతరం ప్రతిపక్షాల మణిపూర్ అంశంపై చర్చకు డిమాండ్ చేశాయి. సభా కార్యకలాపాలు రద్దుచేసి దీర్ఘకాలిక చర్చ జరపాలని డిమాండ్ చేశాయి.అయితే దీనిపై స్వల్పకాలిక చర్చకు తాము సిద్ధమేనని ప్రభుత్వం ప్రకటించింది. అందుకు విపక్షాలు అంగీకరించలేదు. ప్రతిపక్ష సభ్యులు సంయమనం పాటించాలని చైర్మనః జగదీప్ ధన్‌కర్ కోరినా వారు వాంతించలేదు. దీంతో సభను మధ్యాహ్నం 2.30 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ధన్‌కర్ ప్రకటించారు.

మధ్యాహ్నం 2.30 గంటలకు సభ తిరిగి సమావేశమైన తర్వాతచైర్మన్ ధన్‌కర్ గురువారం జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం తర్వాత కమిటీ ఇచ్చిన నివేదిక గురించి తెలియజేస్తూ, దీన్ని పరిగణనలోకి తీసుకోవలసి ఉందని చెప్పారు. అయితే అటవుల పరిరక్షణ బిల్లుతో పాటుగాఢిల్లీ ఎన్‌సిటి సవరణ బిల్లును లిస్టింగ్ చేయడంపై పలువురు విఓక్ష సభ్యులు అభ్యంతరం తెలియజేస్తూ బిఎసి సమావేశంలో ఈ బిల్లులపై తమ అభిప్రాయాలను ఇప్పటికే తెలియజేసినట్లు తెలియజేశారు. విపక్ష సభ్యుల గొడవతో చైర్మన్ సభను సోమవారానికి వాయిదా వేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News