Sunday, April 28, 2024

మణిపూర్ చురాచంద్‌పూర్‌లో ఉద్రిక్తత..ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

చురాచంద్‌పూర్ : మణిపూర్‌లోని చురాచంద్‌పూర్ పట్టణంలో పరిస్థితి శుక్రవారం కూడా ఉద్రిక్తంగానే ఉందని పోలీసులు వెల్లడించారు. ఒక కానిస్టేబుల్ సస్పెన్షన్‌కు నిరసన సూచకంగా ఒక గుంపు గురువారం మినీసెక్రటేరియట్‌లోకి దూసుకుపోయినప్పుడు భద్రత దళాలతో జరిగిన సంఘర్షణలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. గురువారం రాత్రి జరిగిన ఘర్షణలో మరి 42 మంది కూడా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. వైరల్ అయిన వీడియోలో సాయుధ వ్యక్తుల వెంట ఉన్నట్లుగా కానిస్టేబుల్ శ్యామ్‌లాల్‌పాల్ కనిపించిన తరువాత అతనిని సస్పెండ్ చేశారు. మృతులను లెత్లాల్‌ఖువోల్ గంగ్తె, తంగున్‌లెన్ హవోకిప్‌గా గుర్తించినట్లు పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.

‘తీవ్రంగా గాయపడిన ఇద్దరు వ్యక్తులను చురాచంద్‌పూర్ జిల్లా ఆసుపత్రిలో చేర్చించినట్లు ఆయన తెలిపారు. ‘చురాచంద్‌పూర్ జిల్లా మినీ సెక్రటేరియట్ ప్రాంతం పరిసరాల్లో ఆస్తుల విధ్వంసం, దగ్ధం వార్తలు వచ్చాయి’ అని ఆ అధికారి చెప్పారు, ‘ముఖ్యమైన పలు పత్రాలు, ప్రభుత్వ రికార్డులను హింసాకాండలో ధ్వంసం చేశారుర’ అని అధికారి తెలియజేశారు. డిప్యూటీ కమిషనర్ అధికార నివాసానికి కూడా అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఆగ్రహోదగ్రులైన మూకలు నిప్పు అంటించినట్లు పోలీసులు తెలిపారు. ఇది ఇలా ఉండగా, జిల్లా ఎస్‌పి శివానంద్ సుర్వే, డిసి ఎస్ ధరున్ కుమార్ ’24 గంటల్లో’జిల్లా వదలి వెళ్లాలని, వారి స్థానాల్లో ‘వీలైతే కుకి జో తెగ నుంచి అధికారులను’ నియమించాలని స్వజాతీయ గిరిజన నాయకులు వేదిక (ఐటిఎల్‌ఎఫ్) డిమాండ్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News