Sunday, April 28, 2024

మణిపూర్‌లో మళ్లీ కాల్పులు… ఏడుగురు భద్రతా సిబ్బందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్ : జాతుల ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో మంగళవారం మళ్లీ కాల్పులు చోటుచేసుకున్నాయి. తోంగనోవ్‌పల్ జిల్లా మోరేహ్ జిల్లాలో గాలింపు చర్యలు జరుపుతున్న ఏడుగురు భద్రతా సిబ్బంది ఈ ఘటనలో గాయపడ్డారు. దౌబల్ జిల్లాలో సోమవారం నలుగురు వ్యక్తులు హతులైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాత్రి కర్ఫూను అమలు చేస్తుండగా తాజా సంఘటన చోటు చేసుకుంది. ఛంవాగ్‌పాయ్ నుంచి నిరాయుధులైన పౌరులను కమెండోలు కిడ్నాప్ చేశారన్న సమాచారంతో గుర్తు తెలియని సాయుధులకు, భద్రతా బలగాలకు మధ్య మంగళవారం రెండు గంటలకు పైగా కాల్పులు చోటు చేసుకున్నాయని కుకీస్ అంబ్రెల్లా గ్రూప్‌కు చెందిన ప్రతినిధి ఒకరు తెలిపారు.

అయితే ఈ వార్తలను తోంగనోప్‌పల్ పోలీస్ సూపరింటెండెంట్ లుయికం లాన్మియో తోసిపుచ్చారు. ఎలాంటి హెచ్చరికలు లేకుండానే కాల్పులు చోటు చేసుకున్నాయని, గాయపడిన భద్రతా సిబ్బందిలో ఐదుగురిని ఇంఫాల్ లోని రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లోనూ , మరో ఇద్దరిని మోరేహ్ లోనూ చేర్చినట్టు డిప్యూటీ కమిషనర్ క్రిష్ణకుమార్ తెలియజేశారు. గాయపడిన వారిలో నలుగురు మణిపూర్ పోలీస్ కమెండోలు, ముగ్గురు సరిహద్దుభద్రతా సిబ్బంది ఉన్నారు. కర్ఫూ చర్యలపై మంగళవారం నాడు ఉన్నతాధికారులు సమీక్ష జరపాల్సి ఉండగా తాజా దాడి జరిగినట్టు చెప్పారు.

మయన్మార్ ప్రమేయంపై సీఎం అనుమానాలు
మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మయన్మార్ సరిహద్దుల్లోని మోరే నగరంలో భద్రతా బలగాలపై మిలిటెంట్లు మెరుపుదాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో నలుగురు పోలీస్ కమోండేలు. ఓ బీఎస్‌ఎఫ్ జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. ఇంఫాల్‌లో చికిత్స పొందుతున్న బాధితులను ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ పరామర్శించారు. మోరెహ్ జిల్లాలో భద్రతా బలగాలపై దాడి ఘటనను ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ ఖండించారు. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మయన్మార్ నుంచి విదేశీ కిరాయి సైనికులు పాల్గొన్నట్టు తెలుస్తోందన్నారు. రాష్ట్ర ప్రజల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇలాంటి బెదిరింపులు, ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని సిఎం స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News