Friday, April 19, 2024

రేపటి నుంచి పదో తరగతి విద్యార్థులకు అల్పహారం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ, హైదరాబాద్: నగరంలో పదో తరగతి పరీక్షలకు విద్యార్థులను సన్నద్దం చేసేందుకు రేపటి నుంచి సాయంత్రం వేళ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుండటంతో వారికి అల్పాహారం అందజేయనున్నట్లు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ఏప్రిల్ ఒకటో తేదీవరకు స్పెషల్ క్లాస్ ఉండటంతో అప్పటివరకు పంపిణీ చేస్తామని, పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3వ తేదీ నుంచి ప్రారంభమైతాయని ఈసారి ఉత్తమ ఫలితాలు సాధించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. అన్ని ప్రభుత్వ, మోడల్ స్కూళ్లలో అమలు చేయాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రతిరోజు ఒక్కో విద్యార్థిపై రూ. 15 చొప్పన ఖర్చు చేయనున్నట్లు, 34 రోజుల పాటు స్నాక్స్ పంపిణీ స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ నిర్వహిస్తుందన్నారు.

జిల్లాలో 182 ఉన్నతపాఠశాలుండగా వాటిలో 35వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నట్లు, వారంతా ఉత్తీర్ణులయ్యేలా పాఠాలు బోధిస్తున్నట్లు, ప్రభుత్వం మనబస్తీ మనబడి కార్యక్రమం చేపట్టడంతో 12 రకాల వసతులు స్కూళ్లో ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. వచ్చే విద్యాసంవత్సరం సర్కార్ బడులు విద్యార్థులతో సందడిగా మారుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ స్కూళ్ల తరహాల్లో విద్యా బోధనతో పాటు అధునాతన సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేద, మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్చాలని సూచిస్తున్నారు. వేలకు వేలు ఫీజులు చెల్లించకుండా అందరికి విద్యా అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం నూతన విధానాలు అమలు చేస్తుందంటున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యాప్రమాణాలు అందేందుకు ఇటీవల విద్యాశాఖ తీసుకుంటున్న చర్యలను ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అదే విధంగా టీచర్ల బదిలీ ప్రక్రియ కూడా పారదర్శకంగా జరగాలని కోరుతున్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించారని గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News