Saturday, April 27, 2024

బిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హసన్‌పర్తి : అన్నివర్గాలకు సమ ప్రాధాన్యత కల్పిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి కెసిఆర్ అని బిఆర్‌ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్ధన్నపేట ఎంఎల్‌ఎ ఆరూరి రమేష్ అన్నారు. ఆదివారం వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని గ్రేటర్ వరంగల్ 55వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రజితవెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బిఆర్‌ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి ఎంఎల్‌ఎ ఆరూరి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. భీమారంలోని డివిఆర్‌గార్డెన్స్‌లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో స్థానిక కార్పొరేటర్ జక్కుల రజితవెంకటేశ్వర్లు, పార్టీ శ్రేణులు ఎంఎల్‌ఎకు ఘన స్వాగతం పలికారు. ఈసందర్భంగా ఎంఎల్‌ఎ ఆరూరి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రానికి కెసిఆర్ శ్రీరామరక్ష అని, ప్రజల అవసరాలను ముందుగానే గుర్తించి దానికనుగుణంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న గొప్పనాయకుడు సిఎం కెసిఆర్ అని తెలిపారు. వర్ధన్నపేట నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నానని వెల్లడించారు.

55వ డివిజన్ భీమారంలో రూ.38 కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టినట్లు తెలిపారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తున్న కార్యకర్తల కృషి వెలకట్టలేనిదన్నారు. ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. ఇతర రాజకీయ పార్టీలు కేవలం ఎన్నికలు, రాజకీయ ప్రయోజనాలకే పాకులాడుతున్నాయని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి మరోసారి కెసిఆర్ నాయకత్వం అవసరమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలకు కేంద్రం నుండి అనేక అవార్డులు వచ్చాయని, బిజెపి పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ తరహాలో పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం దండుగ అని బిజెపి, కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారన్నారు. కాళేశ్వరం ఉపయోగం ఢిల్లీలో ఉన్నవాళ్లకు ఏం తెలుసునని ప్రశ్నించారు. కాళేశ్వరంపై పెట్టిన పెట్టుబడి ఎప్పుడో వచ్చిందన్నారు. కెసిఆర్ సిఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తెలంగాణ తీరు మారిందని గుర్తు చేశారు. మన రాష్ట్రంలో చెరువులు చూసేందుకు మహారాష్ట్ర రైతులు వచ్చి ఆశ్చర్యపోయారన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న మహారాష్ట్రలో నాలుగురోజులకొకసారి మంచినీరు సరఫరా చేస్తున్నారని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News