Tuesday, April 30, 2024

వారం, పది రోజుల్లో సమస్యలు పరిష్కారమవుతాయిః సి.కళ్యాణ్

- Advertisement -
- Advertisement -

ప్రొడ్యూసర్స్ గిల్డ్, నిర్మాతల మండలి, ఫిలిం ఛాంబర్ అంతా ఒక్కటే. వర్క్‌ను విభజించుకొని చిత్ర పరిశ్రమలోని సమస్యల పరిష్కారానికి పని చేస్తున్నాం” అని అన్నారు. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షులు సి.కళ్యాణ్, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ గురువారం హైదరాబాద్‌లో సమావేశమై థియేటర్స్‌లో విపీఎఫ్ చార్జీలు ఎంత ఉండాలి? ఎన్ని వారాల తర్వాత సినిమా ఓటీటీకి వెళ్తే బాగుంటుంది? లాంటి పలు అంశాలపై చర్చించడం జరిగింది. సమావేశం అనంతరం సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. “తెలుగు సినిమా ఫిలిం ఛాంబర్, తెలంగాణ ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలి తరుపున మేమంతా షూటింగ్‌లు ఆపుకొని సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నాం. మా నిర్మాతలు అందరికీ విన్నపం.. ఎవరు ఏం చెప్పినా వినకండి. వారం, పది రోజుల్లో సమస్యలు పరిష్కారమవుతాయి”అని అన్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ “నిర్మాతలం అందరం కలిసి షూటింగ్స్ ఆపేశాం.

మేం ప్రస్తుతం నాలుగు అంశాలపై చర్చిస్తున్నాం. సినిమాలు ఓటీటీలోకి ఎన్నివారాలకు వెళ్తే ఇండస్ట్రీకి మంచిది అనే విషయంలో కమిటీ వేసుకున్నాం. ఆ కమిటీ ఓటీటీకి సంబంధించిన దానిపై పనిచేస్తోంది. థియేటర్స్‌లో విపీఎఫ్ చార్జీలు, పర్సెంజీలు ఎలా ఉండాలి అనే దానిపై కమిట్ వేశాం. ఆ కమిటీ ఎగ్జిబిటర్స్‌తో మాట్లాడుతోంది. ఆ తర్వాత ఫెడరేషన్ వేతనాలు, వర్కింగ్ కండీషన్స్‌పై కూడా కమిటీ వేశాం. అలాగే నిర్మాతలకు ప్రొడక్షన్‌లో అనవసర ఖర్చు తగ్గింపు, వర్కింగ్ కండీషన్స్, షూటింగ్స్‌లో అనవసర ఖర్చు తగ్గింపుపై కూడా కమిటీ వేశాం. ఫిల్మ్ చాంబర్‌లో ఈ నాలుగు అంశాల మీద నాలుగు కమిటీలు వేశాం. ప్రస్తుతం అవి పనిచేస్తున్నాయి. మా అందరికీ నెలల తరబడి షూటింగ్స్ ఆపాలన్న ఉద్దేశం లేదు. నిర్మాతకు ఏదీ భారం కాకూడదు. గత మూడు, రోజుల నుంచి మూడు, నాలుగు మీటింగ్స్ జరిగాయి. నాలుగు కమిటీలు చాలా హోమ్‌వర్క్ చేస్తున్నాయి. తెలుగు సినిమా ఎలా ఉండాలనేది వర్క్ చేస్తున్నాం. త్వరలో ఆ ఫలితాలు వస్తాయి” అని పేర్కొన్నారు.

C Kalyan gives clarity on Film Shooting issue

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News