Friday, April 26, 2024

వారి వల్లే సినిమా పరిశ్రమ బ్రతికుంది

- Advertisement -
- Advertisement -

”నందమూరి బాలకృష్ణతో ’రామానుజాచార్య’ ప్రాజెక్ట్‌ని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాం. ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. ఓ అంతర్జాతీయ సంస్థ, రవి కొట్టారకరతో కలసి చినజీయర్ స్వామి వారి సహకారంతో ఈ ప్రాజెక్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాను”అని అన్నారు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షులు, ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్. కళ్యాణ్ అమ్యూజ్‌మెంట్ పార్క్ ప్రారంభోత్సవం రోజున ఈ ప్రాజెక్ట్ ఓపెనింగ్ అనుకుంటున్నామని ఆయన చెప్పారు. సి.కళ్యాణ్ శుక్రవారం పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా గురువారం ఆయన మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు.

గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌కు మించిన అవార్డ్ వేడుక…
కళ్యాణ్ అమ్యూజ్‌మెంట్ పార్క్ ప్రాజెక్ట్ చేయడం తమిళనాడు ప్రభుత్వం, దేవుడు ఇచ్చిన వరం. చెన్నై నుండే ఒక సహాయ దర్శకుడిగా నా కెరీర్ ప్రారంభమైంది. ఇప్పుడు అక్కడ ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేయడం ఒక మైల్ స్టోన్ మార్క్‌గా నిలుస్తోంది. అలాగే సదరన్ ఇండస్ట్రీ కోసం ప్రతి ఏడాది పెద్ద ఎత్తున అవార్డులు ఇచ్చే కార్యక్రమం కూడా చేపడుతున్నాం. సదరన్ ఇండస్ట్రీకి పెద్దపీట వేస్తూ గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌కు మించి అవార్డ్ వేడుకని ఏర్పాటు చేయాలని సన్నాహాలు చేస్తున్నాం. ఇండియన్ ఫిల్మ్ ఫెడరేషన్ సపోర్ట్‌తో వచ్చే ఏడాది జనవరిలో ఇది మొదలుపెట్టడానికి ప్రయత్నిస్తున్నాం.
వారి వల్లే సినిమా పరిశ్రమ బ్రతికుంది…
30 రోజులు షూటింగ్స్ ఆపడమనేది అట్టర్ ఫ్లాఫ్ షో. చిన్న సినిమా నిర్మాతకు విడుదల రోజున చాలా సమస్యలు వున్నాయి. వీటికి పరిష్కారం దొరుకుతుందని దీనికి సమ్మతించాను. మొదటి నాలుగు మీటింగ్స్‌లోనే దీంతో ఏం జరగదని అర్ధమైపోయింది. కొన్ని సమస్యలు, లోపాలు గుర్తించారు. కానీ వాటి అమలు జరగలేదు. సినిమా పరిశ్రమ బ్రతికుందంటే కొత్తగా వచ్చిన రెండు వందల మంది నిర్మాతల వల్లనే అని భావిస్తాను.
కొందరు పెద్దలు దీన్ని మారనివ్వరు…
థియేటర్లు రెంటల్ వ్యవస్థ నుండి పర్సెంటేజ్‌లోకి మారనివ్వరు కొందరు పెద్ద వాళ్లు. దీనికి కారణం కూడా అందరికీ తెలుసు. దేవుడి దయవల్ల రెండు తెలుగు రాష్ట్రాలకు ఎన్.టి రామారావు లాంటి ముఖ్యమంత్రులు వచ్చి స్లాబ్ సిస్టం తెస్తే కానీ ఇది మారదు.
చేస్తున్న సినిమాలు…
ఎస్వీ కృష్ణా రెడ్డితో ‘ఆర్గానిక్ మామా హైబ్రీడ్ అల్లుడు’ సినిమా సిద్ధమైంది. ఆయనకు మళ్ళీ మంచి బ్రేక్ వస్తుందని అనుకుంటున్నాను. చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. ఇంకొన్ని చిన్న సినిమాలను కూడా చేస్తున్నాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News